వైకాపావి చౌకబారు ప్రచారాలు

 

గుంటూరు, మార్చి 5, (globelmdianews.com
మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ డేటా చోరీ జరిగింది. టీడీపీ పార్టీకి సంబంధించిన డేటా పోయిందని వైసిపి వాళ్లు పిర్యాధు చేయడం ఆచర్యంగా ఉంది. ఇవి అనైతికమైన చర్యగా ఉందని స్పీకర్ కోడెల శివస్రపాదరావు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగించడం అనైతికమైన చర్య. నరసరావుపేట నియోజకవర్గంలోనే 15వందల ఓట్లు తోలగించడం జరుగుతుంది. మా ఓట్లు తీస్తున్నారని వైసిపీ వాళ్లు అనడం అనైతికమైన చర్య. నుండి రాజకీయాల్లో ఉన్నా ఇలాంటివి ఎప్పుడు చూడలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు కులాలమధ్య చిచ్చుపెట్టి లబ్ధిపోందాలని చూస్తున్నారు. తునీ ఘటన, అధికారులపై దాడులు చేయడం చూస్తే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదూ.


వైకాపావి చౌకబారు ప్రచారాలు

స్పీకర్ గా నామీద అనేక చౌకబారు, నీచమైన, అవాస్తవమైన ప్రచారాలు చేయడం జరుగుతుంది. దమ్ముంటే వైసీపీ నాయకులు ఎదురుగా వచ్చి పోరాడాలి. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అరాచకాలు చేస్తారో అనిపిస్తుంది. ప్రజలు, అధికారులు, రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాలి. పీకే సలహ మేరకే ఓట్ల తోలగింపు చేయడం జరుగుతుంది. నాకు రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీ కోసం చివరివరకు పోరాడతాం. పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లి పోటీచేస్తాం. వైసీపీకి టీఆరెస్, బీజేపీలు తోత్తులుగా మారారు. గతంలో జగన్ ను విమర్శించిన టీఆరెస్, బీజేపీ నేడు జగన్ పల్లకి మోస్తున్నారు. ఎవరూ ఎన్ని కట్రలు పన్నినా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధే ఈ పార్టీని అధికారంలోకి తీసుకువస్తుంది. ఈ ప్రభుత్వ పాలనలో నేడు అన్ని వర్గాల వారు సంతృప్తిగా ఉన్నారు. వైసీపీ చేస్తున్న అనైతికమైన పనులు వారికే నష్టాన్ని తీసుకువస్తాయి. ఇది తెలంగాణ రాష్ట్రం, వైసీపీ సంబంధించినది కాదూ.... అలాంటిది వైసిపి తెలంగాణకు పిర్యాదు చేయడం ఏంటని అయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం దీనిమీద ఓవర్ యాక్షన్ చేయడం ఏంటీ.
తెలుగువారు భౌతికంగా విడిపోయిన కలసే ఉన్నాం. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా ఉంది దానిపై ఇంకా ప్రజలకు అధికారం ఉంది. రాజ్యాంగ బధ్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఇలా చేయడం కరెక్ట్ కాదూ.  సత్తెనపల్లి, నరసరావుపేట రెండు నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేశాం. అక్కడ పార్టీ నుండి ఎవ్వరూ పోటీ చేసిన గెలిపిస్తామని అయన అన్నారు. 

No comments:
Write comments