ఓటింగ్ శాతం పెంపు కై ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన కమిషనర్ దానకిషోర్

 

హైదరాబాద్, మార్చ్ 13 (globelmedianews.com)   
 హైదరాబాద్ లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించడానికిగాను జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓటరు చైతన్య వాహనాలను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ నేడు ప్రారంభించారు. స్వీప్ నోడల్ అధికారి దాసరి హరిచందన, అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో ఓటరు చైతన్య రథాలను జెండాఊపి ప్రారంభించారు. ఈ వాహనాలలోకి దివ్యాంగులు సులభంగా వెళ్లి పరిశీలించడానికి వీలుగా ర్యాంప్ల నిర్మాణం, ఈవీఎంలు, వివిప్యాట్లను ప్రదర్శన నిమిత్తం ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లోకి కమిషనర్ దానకిషోర్ స్వయంగా వెళ్లి ఈవీఎం, వివిప్యాట్ల పనితీరును పరిశీలించారు. 


ఓటింగ్ శాతం పెంపు కై ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన కమిషనర్ దానకిషోర్

హైదరాబాద్ నగరంలో గత శాసన సభ ఎన్నికల్లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు అయ్యిందని, ఈ సారి ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంపొందించడానికి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన, స్వీప్ కార్యక్రమాల క్రింద ప్రతి మున్సిపల్ వార్డులో శాశ్వత వివిప్యాట్, ఈవీఎంల ప్రదర్శన కేంద్రం, మొబైల్ వాహనాల ద్వారా చైతన్య కార్యక్రమాల నిర్వహణ, వివిధ సామాజిక ప్రసార మాద్యమాలు హోర్డింగ్ల ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంపొందించడానికి పెద్ద ఎత్తున  ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నట్టు వివరించారు. ఈ సారి ఎన్నికల్లో దివ్యాంగుల ఓటింగ్ను పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, దీనిలో భాగంగా ఓటరు ఆక్సెసబులిటి యాప్ ఫర్ ద డిఫరెట్లి ఏబుల్డ్ (వాదా) యాప్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సారి కూడా ఎన్నికల్లో అంధులతో సహా దివ్యాంగులందరూ ఓటువేసేందుకుగాను తగు సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా వాధా యాప్ను ప్రతిఒక్క దివ్యాంగులు ఉపయోగించుకోవాలని కోరారు. 

No comments:
Write comments