ప్రజలకు సేవలందించడంలో సర్పంచుల పాత్ర కీలకం

 

జిల్లా కలెక్టర్ 
కామారెడ్డి మార్చి 7 (globelmedianews.com)  
నూతనంగా ఎన్నికయిన సర్పంచులు బాధ్యతాయుతంగా  పనిచేసి ప్రజలకు సేవలందించడంలో తమ వంతు పాత్రను పోషించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం - 2018, సెక్షన్ 16 ను అనుసరించి సర్పంచులు తప్పనిసరిగా శిక్షణపొందాలని, సామాజిక కార్యకర్త అన్నా హజారే ను ఆదర్శంగా తీసుకొని గ్రామాలను 'రోల్ మోడల్' గా తయారు చేయాలని అన్నారు. 


 ప్రజలకు సేవలందించడంలో సర్పంచుల పాత్ర కీలకం 

గ్రామాల్లో రీఛార్జ్ గుంతలు త్రవ్వించి వర్షపునీటిని భూమిలోనికి ఇంకే టట్లుగా చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పంచాయతీకి ఒక నర్సరీ ని ఏర్పాటు చేసి 40 వేల మొక్కలను పెంచాలని ఇందులో 85% మొక్కలు తప్పనిసరిగా బ్రతకాలని కలెక్టర్ సూచించారు. సెక్షన్ 32 ద్వారా తమ విధులను తప్పనిసరిగా అమలు పరచాలని అన్నారు. కామారెడ్డి జిల్లా ఉపాధి హామీ పథకంలో దక్షిణ భారతదేశంలో ఎంపిక కాబడిన మూడు జిల్లాల్లో అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ గుర్తు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక డంపు యార్డును ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం కోసం 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. సర్పంచులు చేసే పనులపై సెక్షన్ 34 ప్రకారం తప్పనిసరిగా ఆడిట్ నిర్వహించబడుతుందని, పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేయక పోయినచో వారిపై జిల్లా కలెక్టర్ చే ప్రత్యక్ష చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ పంచాయతీ అధికారి సాయన్న ,   శిక్షణలో ఉన్న  డి పి ఓ జయసుధ, రిసోర్స్ పర్సన్ గోపాల్ రావు, సిబ్బంది, జిల్లాలోని పలు మండలాల సర్పంచులు పాల్గొన్నారు.

No comments:
Write comments