చంద్రబాబు వున్నాడు జాగ్రత్త

 

హైద్రాబాద్, ఫిబ్రవరి 07 (globelmedianews.com)  
టిడిపికి ప్రజాబలం లేదని ఇప్పుడు స్పష్టంగా అర్దమవుతుంది.  యుద్దం ప్రారంభం కానున్న నేపధ్యంలో మీ యోధానుయోధులాంటి నాయకులు లోటస్ పాండ్ బాట పడుతున్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచే పరిస్దితి టిడిపికి లేదని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గురవారం అయన మీడియాతో మాట్లాడారు.  అడ్డదారుల్లో గెలవాలని టిడిపి తపన.ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి ,దగా చేసి, మాన్యూపులేషన్ చేసి, ప్రజలకు వెన్నుపోటు పొడిచి,లేదా వ్యవస్దలను మేనేజ్ చేసి గెలవాలి.డేటా చోరీ దానిలోనుంచి పుట్టింది. నీకు ఓటు వేయాలనుకున్నవాడికి రెండు ఓట్లు ఇస్తావా? నీకు ఓటు వేయకూడదని అనుకున్నవాడికి ఓటే లేకుండా చేస్తావా? అదేమంటే జగన్ పై ఆరోపణలు చేస్తున్నావు.నేను అడుగుతున్నా మేం ఎప్పుడైనా ఎంఎల్ ఏలను కొన్నామా?
-23 మంది మా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏలను కొన్నది ఎవరు? వారిలో నలుగురుని మంత్రులుగా చేసింది ఎవరు? తెలంగాణాలో ఎంఎల్సి ఎన్నికలలో ఎంఎల్ ఏని కొనుగోలు చేస్తూ దొేరికిపోయింది మీరా మేమా అని ప్రశ్నలు కురిపించారు. మంచి అబద్దాలు దగాకోరు మాటలు.ఇంతఅందంగా చెబుతుంటే ప్రజలు నమ్ముతారేమే అని భయమేస్తుంది. గవర్నర్ కలసి జగన్  కొన్ని ప్రశ్నలు సంధిస్తే వాటికి సమాధానం లేదు. ఇది రెండు రాష్ర్టాల మధ్య యుద్దం.వారితో కాదు మీకు మాతో కదా యుధ్దం. 


చంద్రబాబు వున్నాడు జాగ్రత్త

డేటా చోరిని రెండు రాష్ర్టాల సమస్యగా చిత్రీకరిస్తున్నారు. అభివృద్దికి అడ్డుపడుతున్నారని చంద్రబాబు జగన్ పై విమర్శలు చేస్తున్నారు.  వైయస్సార్ పాలన కూడా చూశాం.ఆయన ఎప్పుడైనా నీలా వాజమ్మలా మాట్లాడారా? అభివృద్ది బ్రహ్మాండంగా చేశానని చెబుతావు.అదేమంటే మోది,జగన్ అడ్డుపడ్డారని చంద్రబాబు బొంకుతుంటారు. జాతీయ భద్రతకు సంభందించిన ఆధార్ డేటాను సేవామిత్రలో పెట్టావు.ఇది నేరం కాదా? ఓటర్ల జాబితా కలర్ ఫోటో లతో కూడినది మాస్టర్ కాపీని తీసుకువెళ్లి సేవామిత్రాలో పెట్టావు.
-బ్యాంకు అకౌంట్లను తీసుకువెళ్లి పబ్లిక్ గా సేవామిత్రలో పెట్టావా లేదా? నీ బ్యాంక్ అకౌంట్లు,లోకేష్ అకౌంట్లు వాటివివరాలు పబ్లిక్ లో పెడతావా? పల్స్ సర్వే ద్వారా ఏపి ప్రభుత్వం సేకరించిన డేటా అంతా ,సంక్షేమపధకాల వివరాలు సేవామిత్రలో పెట్టావా లేదా? వాటికి సమాదానం చెప్పకుండా రాఫెల్ కుంభకోణం, అభివృద్దికి అడ్డు అంటూకేసిఆర్ కేటిఆర్ అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. కోర్టులు కూడా చాలాసార్లు చెప్పాయి ఆధార్ సమాచారం ఎవ్వరికి ఇవ్వద్దు అని . చంద్రబాబూ ముందు చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎందుకు పారిపోతున్నావు చంద్రబాబూ అని అన్నారు.  ఫారం 7 దరఖాస్తు చేయకూడదని దుష్ర్రచారం చేస్తున్నారు.ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాలలో రెండు ఓట్లు ఉన్నాయి అని
వాటిలో ఒకటి మాత్రమే ఉండాలి కాబట్టి. ఫారం 7 ఎందుకు పెట్టకూడదు.ఓటర్ల డబల్ ఎంట్రికి ఫారం 7 ద్వారానే న్యాయం జరుగుతుంది. కుక్కలున్నాయి జాగ్రత్త,జేబు దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డులు పెడుతుంటారు.కాని నేడు ఏపిలో చంద్రబాబు ఉన్నాడు ఓట్లు జాగ్రత్త అంటూ బోర్డులు పెట్టాల్సిన పరిస్దితి వుందని అన్నారు. ఫారం 7 పెట్టినవారిపై కేసులు పెట్టాలి అనే వాదన ఎందుకు తీసుకువస్తున్నారు. ఇది దుర్మార్గమైన అన్యాయమైన ఆలోచన. సత్తెనపల్లిలో పోటీ చేసి ఓటమి పాలయ్యాను.నా ఓటుతోపాటు కుటుంబసభ్యుల ఓట్లు తొలగించారు. నీవు, స్పీకర్ కలసి కుట్ర చేసి నా ఓట్లను  తలగించారు. రెవిన్యూ,అదికారయంత్రాగం సహాయంతో ఇలా చేసింది నీవు కాదా? అని నిలదీసారు. ఐటి గ్రిడ్ పై దాడి చేశారు.అశోక్ అనే వాడిని దాచేశావు.నీకు దమ్ముంటే పంపు విచారణ చేసి వాస్తవాలు వెలికితీస్తారు. ఓటుకునోటు కేసులో సైతం నిందితులను ఏపిలో దాచేశావు. చేసేవి దొంగపనులు చెప్పేది న్యాయం,ధర్మం అంటూ డ్రామాలు.  చంద్రబాబూ నీకు దమ్ముంటే..ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యంను ఖూని చేసే విధంగా ఓట్ల తొలగించే ప్రయత్నం చేయకపోతే  ఈ వ్యవహారంలో...-ఏ విఛారణకైనా టిడిపి, చంద్రబాబు సిధ్దంగా ఉన్నాడు అని ధైర్యంగా చెప్పగలవా అని అడిగారు. చెప్పలేవు?ఎందుకంటే ధైర్యం లేదు.నీవు దొంగవి విచారణ జరిపితే దొరికిపోతావు. నీవు దుర్మార్గుడివి కాబట్టే అందుకు సిధ్దపడలేకపోతున్నావు. గత ఎన్నికలలో కేవలం ఐదులక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాం. నా నియోజకవర్గంలో సైతం 9 వందల పైచిలుకు ఓట్లతో ఓడిపోయామని అయన అన్నారు. 

No comments:
Write comments