మండే సూర్యుడు

 

హైద్రాబాద్, మార్చి 14, (globelmedianews.com)
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రభానుడు ప్రచండంగా నిప్పులు కురిపిస్తున్నాడు. మార్చి నెల మొదట్లోనే సూర్య ప్రతాపానికి జనం హడలెత్తిపోతున్నారు. ఉదయం పది గంటలకే ఎండ తీవ్రత అధికమవుతోంది. వేడి గాడ్పులు, ఉక్కపోతతో మిట్టమధ్యాహ్నం రోడ్డుపైకి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. సాధారణానికి మించి నాలుగు.. ఐదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నాడు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు ప్రైవేటు వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ పేర్కొంది. ఈ మేరకు టాప్-10లో ఏపీ, తెలం గాణలకు చెందిన మూడు నగరాలు ఉండడం గమనార్హం. దేశంలోనే అత్యధికంగా కర్నూలు, అనంతపురంలలో గరిష్ఠ ఉషో ్ణగ్రత 38.6 డిగ్రీలుగా నమోదైంది. ఆ తర్వాతి స్థానా ల్లో కేరళలోని కొట్టాయం, త్రిసూర్‌లలో 38.5 డిగ్రీలు, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో 38.4, గుజరాత్‌లోని వడోదర, కర్ణాటకలోని బళ్లారి, తెలంగాణలోని మహబూబ్‌నగర్, మహారాష్ట్రలోని నందుర్బార్, సోలాపూర్ లలో 38 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు స్కైమేట్ తెలిపింది. వడ గాడ్పులు అధికమ య్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరి స్తోంది. 


మండే సూర్యుడు

ఈ వారంలో తెలంగాణ, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాలులు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర, తూర్పు, మధ్య భారతంలోని రాష్ట్రాల్లో సాధారణం కన్నా 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.వచ్చే వారం నుంచే ప్రచండ భానుడు ప్రతాపం చూపించబోతున్నాడు. ఈ ఏడాది వేసవి మునుపెన్నడూ లేనంతగా మండిపోబోతోంది. ఓ వైపు ఎండ తీవ్రత.. మరోవైపు వడగాలులు.. తీవ్ర ఉక్కపోత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేయబోతోంది. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిపోబోతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రత అసాధారణంగా 52 నుంచి 54 డిగ్రీల వరకు చేరే ప్రమాదం ఉంది.. ఈ సంవత్సరం సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఒకటి నుంచి అయిదు శాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. గతేడాది గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఈ ఏడాది 52-54మధ్యలో వేడిమి ఉంటుందని అంచనా వేసినట్లు వివరించారు. కోస్తా ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైవీ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజలను అప్రవుత్తం చేసేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, ఒకేసారి లక్ష మందికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారాన్ని అందించే వ్యవస్థను రూపొందించామని చెప్పారు. అలాగే సిగ్నల్స్ దొరకని ప్రాంతంలో స్మార్ట్‌ఫోన్లకు సందేశాన్నిచ్చే ఆధునిక వ్యవస్థలను రూపొందించే పైలట్ ప్రాజెక్టును చేపట్టావున్నారు. 

No comments:
Write comments