సిటీకి ఎలక్ట్రికల్ బస్సులొచ్చాయి....

 

హైద్రాబాద్, మార్చి 2, (globelmedianews.com)
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే మరో నాలుగు రోజుల్లో నగర రహదారులపై విద్యత్ బసులు పరుగులు తీయనున్నాయి. ఇప్పటికే నూతన బస్సులను వినియోగంలోకి తెచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిన ఆర్‌టిసి అధికారులు ఇక వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్షంగా సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో పాటు రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి చేతలు మీదుగా ఈ బస్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట ఆర్‌టిసిపై సమీక్ష నిర్వహించిన మంత్రి సైతం స్పష్టం చేయడంతో ఆదివారం నుంచి బస్సులను తిప్పేందుకు అధికారులు అన్ని రకాల చర్యలను పూర్తి చేశారు. రాకపోకలకు అవసరమైన కార్యాచరణను పూర్తి చేసిన అధిర యంత్రాంగం రూట్లపై కూడా కసరత్తు పూర్తి చేసింది.


సిటీకి ఎలక్ట్రికల్ బస్సులొచ్చాయి....

విద్యుత్ బస్సుల నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుందన్నారు. ప్రతీ కిలో మీటర్‌కు ఒక కిలోవాట్ విద్యుత్ అవసరమని, దీనికి ఆరు రూపాయలు ఖర్చవుతుందని, ఒక్కో బస్సు రోజుకు వంద కి.మీ. వరకు తిరిగితే రూ. 600 మేర విద్యుత్ ఖర్చవుతుంద న్నారు. ఐదు గంటల ఛార్జింగ్ పెడితే దాదాపు 300 కి.మీ మేర తిరుగుతుందన్నారు. డీజిల్ బస్సులతో ఒక్కో లీటర్‌కు రూ.70 వంతున ప్రతీ ఐదు కి.మీ.కు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, సగటున ఒక కి.మీ.కు ఎనిమిది రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. ఇక ఇంజన్, గేర్‌బాక్స్, క్లచ్‌తో పాటు ఇతర విడి విభాగాల నిర్వహణ కూడా భారీగానే ఉంటుందని వివరించారు.నిర్వహణ ఖర్చు బాగా తగ్గుతుందని, సంస్థకు ఆదా అవుతుందన్నారు. విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం ఆర్‌టిసి యాజమా న్యం బివైడి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ఒక్కో కి.మీ. కు రూ. 36 చొ ప్పున గ్రీన్‌టెక్ సంస్థకు ఆర్‌టిసి చెల్లిస్తుంది. పూర్తిస్థాయి లో శిక్షణ పొందిన డ్రైవర్లు గ్రీన్‌టెక్ సంస్థకు సంబంధించిన వారే. 12 ఏళ్లు ఒప్పందం అమలులో ఉంటుంది.విద్యుత్ ఆధారిత బస్సుల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వంద బస్సుల కోసం బివైడి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇందులో తొలి విడతగా నగరానికి 45 బస్సులు రావాల్సి ఉన్న ప్రస్తుతాని కి 40 బస్సులు చేరుకున్నాయి. ఈ బస్సులను ఇప్పటికే అన్ని రకాలుగా పరిశీలించిన ఆర్‌టిసి అధికారులు ఆయా బస్సులను నగర రహదారులపై పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యా రు. దీనికి సంబంధించి రూట్లపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. ప్రస్తుతం నగరంలోని వివిధ రూట్ల నుంచి ఎయిర్‌పోర్టు 38 ఎసి బస్సులను నడిపిస్తున్నారు. వీటిని పూర్తిగా వేరే రూట్లకు మళ్లించి వాటి స్థానంలో విద్యత్ ఆధారిత బస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. నగరంలోని రెండు ప్రధాన రూట్ల నుంచి ఈ వాహనాలు ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించనున్నాయి.ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బస్సులను ముందుగా ఎయిర్‌పోర్టుకే పరిమితం చేయాలని నిర్ణయించిన ఆర్‌టిసి ఆ మేరకు అవసరమైన కసరత్తును కూడా పూర్తి చేసింది. ఈ బస్సులు సత్ఫలితాలిస్తే సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండవ విడతగా మిలిగిన 60 బస్సులు నగరానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రెండవ దశ కింద వచ్చే బస్సులను ఎయిర్‌పోర్ట్‌కు కాకుండా ఇతర మార్గాల్లో తిప్పించేందుకు చర్యలు తీసుకుంటా మని ఆర్‌టిసి అధికారులు తెలిపారు. ఈ బస్సుల పనితీరు, వీటి సామర్థంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు అన్ని రకాలుగా ఆర్‌టిసి లాభం చేకూరితే ఈ బస్సుల వినియోగం మరింత పెరిగే అవకాశముంటుందని అధికార యంత్రాంగం అభిప్రాయపడుతోంది.

No comments:
Write comments