నిజామాబాద్ లో అడగుడుగునా నిఘా

 

నిజామాబాద్, మార్చి 11, (globelmedianews.com)
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే కీలకం. జిల్లాలోని ఉట్నూర్, ఇతర ప్రాంతాల్లో చోటు చేసుకున్న సంఘటనల్లో నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. సీసీ కెమెరాలు ఈ ప్రాంతాల్లో అమర్చి ఉంటే నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులకు సులువుగా ఉండేది. ఈ విషయమై కలెక్టర్ దివ్యదేవరాజన్, ఎస్పీ విష్ణువారియర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోనే సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని పోలీసులకు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 86 సమస్యాత్మక, 59 అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో 500లకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కలెక్టర్ ప్రత్యేక ఫండ్ నుంచి రూ.20లక్షల నిధులను కేటాయించారు. ఈ కెమెరాల ఏర్పాటుకు జిల్లా పోలీసు యంత్రాంగం టెండర్లను ఆహ్వానించారు. 


నిజామాబాద్ లో  అడగుడుగునా నిఘా

ఈనెల 8లోగా టెండర్లు పూర్తి చేసి ఏప్రిల్ 1వరకు జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటుతో దొంగతనాలు, ఇతర నేరాలు జరగవని భావిస్తున్నారు. ఉదాహరణకు.. గత ఏడాది కొంత మంది అల్లరి మూకలు ఇండ్ల వద్ద నిలిపి ఉన్న కార్ల అద్దాలను ధ్వంసం చేయగా.. వారిని ఈ సీసీకెమెరా పుటేజీ ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు నెలల క్రితం పంజాబ్ చౌక్‌లో ద్విచక్ర వాహనాన్ని అర్ధరాత్రి ఢీకొట్టగా.. వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారును సీసీ కెమెరా పుటేజీ ద్వారా పరిశీలించి పట్టుకొని యజమానిపై కేసులు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోశిస్తాయి.నేర దర్యాప్తులో కీలకమయ్యే సీసీ కెమెరాలను ఈనెల చివరి లోగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు రోజుల క్రితం సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించగా ఈనెల 8లోగా ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించనున్నారు. దొంగతనాలు, ఇతర నేరాలు జరగడం లేదు. అలాగే ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ హెడ్‌క్వార్టర్స్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేస్తున్నారు. ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి 24గంటల పాటు పర్యవేక్షణకు ఓ పోలీసు అధికారిని నియమించనున్నారు.

No comments:
Write comments