అక్రమ నిర్మాణాలు... కోర్టు మెట్లు...

 

నిద్ర పోతున్న  గ్రేటర్ అధికారులు
హైద్రాబాద్, మార్చి15, (globelmedianews.com)
జిహెచ్‌ఎంసిలో చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి. కనీసం ఎలాంటి పరిశీలన, పర్యవేక్షణ లేకుండానే జిహెచ్‌ఎంసి అధికారులు సంతకాలు పెట్టేస్తున్నారు. అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లకు అధికారులే వత్తాసు పలుకుతున్నారు. 'మా స్థలంపై ఇతరులకు అనుమతులెలా ఇస్తారు' అని ప్రశ్నించిన బాధితులకు న్యాయం జరక్కపోగా అక్రమార్కులనే అందలమెక్కిస్తున్నారు. చేసిన తప్పును సరిదిద్దాలని స్వయంగా న్యాయస్థానం ఆదేశించినా.. జిహెచ్‌ఎంసి బేఖాతరు చేస్తోంది. బిల్డరు ఎఫ్‌ బ్లాక్‌ నిర్మాణానికి తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు తీసుకున్నారనీ, ఈ రెండింటి మధ్య ప్రహరీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనీ కోరుతూ 2013లో బి బ్లాక్‌లో నివసించే ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అరుణ్‌కుమార్‌ ఆరేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. జిహెచ్‌ఎంసిలో న్యాయం దక్కకపోవడంతో బాధితుడు లోకాయుక్త, రంగారెడ్డి కోర్టు, రాష్ట్ర వినియోగదారుల ఫోరం, హైకోర్టునూ ఆశ్రయించారు. కోర్టు తీర్పులన్నీ అరుణ్‌కుమార్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తాన్నారు. 


అక్రమ నిర్మాణాలు... కోర్టు మెట్లు...

లీగల్‌ ఓపీనియన్‌ పేరుతో కుంటి సాకులు చెబుతూ ఏళ్ల తరబడిగా కాలయాపన చేస్తున్నారు.విశ్వవిద్యాలయంలో వేలాది మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిన రిటైర్డ్‌ ఫ్రొఫెసర్‌కే ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్‌లో సర్వే నెం.14 (పార్ట్‌), కొత్తగూడ సర్వే నెం. 20 (పార్ట్‌), కొండాపూర్‌ సర్వే నెం.57 (పార్ట్‌)లో ఆరెకరాల స్థలం (23,903 స్క్వేర్‌ మీటర్లు) ఉంది. దాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు ప్రొఫెసర్లు, ఇంజినీర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు కలిసి కొనుగోలు చేశారు. ఈ స్థలాన్ని డెవలప్‌మెంట్‌ కోసం 2007లో ఆదిత్య హోమ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి అప్పగించి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఎ, బి, సి, డి ఇ బ్లాక్‌లను గ్రౌండ్‌ ప్లస్‌ -7 పద్ధతిలో నిర్మించాలని, అందులో పార్కు, స్విమ్మింగ్‌ పూల్‌, క్లబ్‌ హౌస్‌, జిమ్‌, తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ ఆరెకరాల స్థలానికి ఆనుకుని ఉన్న 3200 స్క్వేర్‌ మీటర్ల స్థలాన్ని కూడా ఆదిత్య హోమ్స్‌ కంపెనీయే డెవలప్‌మెంట్‌ చేసింది. ఆ స్థలంలో సౌకర్యాల నిమిత్తం స్థలాన్ని కేటాయించకుండానే నిబంధనలకు విరుద్ధంగా జీ ప్లస్‌-7 పద్ధతిలో ఆదిత్య హోమ్స్‌ ఎఫ్‌ బ్లాక్‌ పేరుతో 39 ఫ్లాట్లు నిర్మించింది. అయితే, ఈ ఎఫ్‌ బ్లాక్‌ను కూడా ఆరెకరాల్లో నిర్మించిన బ్లాక్‌లలోని సౌకర్యాలకు అనుసంధానం చేశారు.డెవలప్‌మెంట్‌ కోసం తీసుకున్న ఆదిత్య హోమ్స్‌ ఆరెకరాల్లో నిర్మించిన 5 బ్లాక్‌లకు 2008లో అనుమతి తీసుకుంది. ఆ తర్వాత 3200 స్క్వేర్‌ మీటర్లలో నిర్మించిన ఎఫ్‌ బ్లాక్‌కు దాని పరిధికే కాకుండా 23,903 స్క్వేర్‌ మీటర్ల పరిధిలోనే 2011లో అధికారులు అనుమతివ్వడం విచిత్రం. ఇక్కడ డెవలపర్స్‌ ఎబిసిడిఇ బ్లాకల సౌకర్యాలు చూపి ఎఫ్‌ బ్లాక్‌కు జిహెచ్‌ఎంసి నుంచి జీ ప్లస్‌-7 పద్ధతిలో అనుమతి తీసుకున్నారు. కనీసం అధికారులు స్థలాన్ని పరిశీలించలేదు. జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, బిల్డర్లకు మధ్య ఉన్న లావాదేవీలతో 2008లో ఇచ్చిన స్థలానికే మళ్లీ 2011లో అనుమతులు ఇచ్చారు.

No comments:
Write comments