నేర చరితులపై ఉక్కుపాదం

 

హైద్రాబాద్, మార్చి 19, (globelmedianews.com
రాష్ట్ర వ్యాప్తంగా నేర స్వభావం ఉన్నవారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2019లో మార్చి 1 నాటకి 75 మందిపై పిడి యాక్ట్ ప్రయోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరస్తుల ఏరివేతలో భాగంగా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సర్చ్‌లు నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 156 కార్డన్ సర్చ్‌లు నిర్వహించారు. కార్డన్ సర్చ్‌లో ఏలాంటి డాక్యూమెంట్లు లేని వందలాది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులు రాత్రుళ్లు ఎక్కడ ఉన్నారన్న సమాచారం సైతం సేకరించేందుకు కార్డన్ సర్చ్‌లు ఉపయోపడుతున్నాయని పలువురు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. అనుమానితులు, నేరాలకు వ్యూహాలు, ప్రజలకు భరోసా కార్డన్ సర్చ్‌ద్వారా సాధ్యమౌతోందంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ మొదలు పెట్టిన నాటి నుంచి నేరాల శాతం కొంతమేర తగ్గినట్లు పోలీసు రికార్డులు సైతం వెల్లడిస్తున్నాయి. పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోలీసు శాఖ మరిన్ని వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. 


నేర చరితులపై ఉక్కుపాదం 

పోలీస్ స్టేషన్ల వారీగా పోలీసులు, ప్రజలతో సమాజ శ్రేయస్సుకు సంబంధించిన కార్యాక్రమాలు రూపొందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వద్దకు వెళ్లి శాంతి భద్రతల పరిరక్షించేందుకు పోలీసు శాఖ సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలను అకట్టుకున్న పోలీసులు తాజాగా ప్రజల భాగస్వామ్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనుంది.వందలాది మంది పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించడం వల్ల ప్రజలకు, పోలీసులకు మధ్య సంబంధాలతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ మరింత ముందుకు సాగుతోందన్నారు. నేరం చేసేందుకు నేరస్తులు భయపడాలి, నేరం చేసిన వారికి శిక్షపడేంతవరకు పోలీసులు వెంటపడాలని పోలీసు బాసుల ఆదేశాల అమలుకు పోలీసు యంత్రాంగం సమాయత్తమౌతోంది.పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోలీసు శాఖ మరిన్ని వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ల వారీగా పోలీసులు, ప్రజలతో సమాజ శ్రేయస్సుకు సంబంధించిన కార్యాక్రమాలు రూపొందించనున్నారు. ముఖ్యంగా పోలీసు, ప్రజల భాగస్వామ్యంపై పెద్ద ఎత్తున ప్రచారం కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని కీలక కేసుల ఛేదన, నేరాల దర్యాప్తు, నేరాల నియంత్రణకు సైతం పెద్దపీట వేయనున్నారు. అదేవిధంగా పోలీసుల శాఖలోని వివిధ విభాగాల సిబ్బందిలో నైపుణ్యతకు పదుపెట్టడం, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను మరింత మెరుగపర్చే విషయంలో పోలీసు శాఖ దృష్టిసారిస్తోందిఈక్రమంలో వివిధ నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్నవారికి కౌన్సెలింగ్‌లు ఇస్తున్నారు. అదేవిధంగా బెయిల్‌పై బయటకు వచ్చిన నేరస్తులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయా పోలీస్ స్టేషన్లలో రికార్డు మెయింటెన్ చేయాలన్న డిజిపి ఆదేశాలు అమలవుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రజలతో మమేకమై మరింత సన్నిహితమయ్యేందుకు రాష్ట్ర పోలీసు బాసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజతో సన్నిహితంగా ఉంటూ వారి సహకారంతో నేరాలను సులువుగా నియంత్రించవచ్చని పోలీసు శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో స్టేషన్లకు వచ్చేవారితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్న విషయం విదితమే.సమాజంలో పోలీసులతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేసి శాంతి భద్రతల పరిరక్షణలో పౌరుల బాధ్యతను గుర్తుచేసేందుకు ఈ కార్యక్రమం రూపొందిస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ప్రజలు తమ చుట్టు పక్కల జరిగే నేరాలు, ఘటనల పట్ల సకాలంలో సమాచారం అందితే ఆయా నేరాలను నియంత్రించడం, నేర ప్రభావాన్ని అరికట్టడంతో పాటు నేరాలను తగ్గుముఖం పట్టించేందుకు ప్రజల సహకారం పోలీసులకు తప్పని సరి అని సదరు పోలీసు బాసులు భావిస్తున్నారు.ఇప్పటికే పోలీసు శాఖ స్టేషన్లకు వచ్చే వారిపట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ మొదలు పెట్టిన నాటి నుంచి నేరాల శాతం కొంతమేర తగ్గినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి.పోలీసు శాఖలోని ప్రత్యేక విభాగాల విస్తరణపై సమాలోచనలు సాగిస్తున్నారు. అలాగే సంస్థాగత సమర్థత పెంపొందింపు విషయంలో ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నారు. పోలీసు శాఖలో కీలకమైన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు పెద్ద పీట వేయనున్నారు. పోలీసింగ్ సైబర్ టెక్నోకమాండ్ సెంటర్, స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. పోలీసు శాఖకు ఇతోధికంగా ఉపయోగపడుతున్న మైత్రి సంఘాలకు మరిన్ని బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ కోసం పాటుపడుతున్న పోలీసు విభాగంలో ప్రజలకు కీలక స్థానం కల్పించే దిశగా పోలీసు శాఖ అడుగులు వేస్తోంది. స్టేషన్లకు వచ్చేందుకు ప్రజలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోలీసులు తమ సేవకులని గుర్తింపు తీసుకోచ్చేందుకు పోలీసుశాఖ వినూత్న వ్యూహాలకు శ్రీకారం చుడుతుండటం గమనార్హం. ఇటీవల కాలంలో ప్రజల పట్ల అమర్యాదగా వ్యవహరించిన పోలీలను ఇంటిదారి పట్టించిన విషయం విదితమే. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగే అధికారులకు అవార్డుల సైతం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం

No comments:
Write comments