ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతా

 

మంత్రాలయం, మార్చి12: (globelmedianews.com)   
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగీరెడ్డి  అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఆయన స్వగృహంలో కోసిగి మండల కేంద్రానికి చెందిన కోల్ మాన్ పేటకు చెందిన టీడీపీ నాయకులు రమేష్ ఆధ్వర్యంలో 60 కుటుంబాలు వైకాపాలోని చేరారు. పార్టీలోకి చేరిన వీరికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .


ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతా

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో 10 నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అంతే కాకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి వైఎస్సార్సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల నాయకులు మురళీ రెడ్డి, మహాంతేష్ స్వామి, జగదీష్ స్వామి, తిక్కమ్మ, గోవిందు, నాగేష్, రామలింగ, రంగారెడ్డి, గౌడ్, తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments