ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే పవర్ ఫుల్ క్యారెక్టర్‌తో ఆర్ ఆర్ ఆర్

 

హైద్రాబాద్, మార్చి 14 (globelmedianews.com)
దర్శకధీరుడు రాజమౌళి (R).. యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు (R).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (R) కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ RRR మూవీ కథపై అనేక రూమర్స్ వినిపించినప్పటికీ.. వాటన్నింటికీ చెక్ పెడుతూ స్టోరీ లైన్ చెప్పారు దర్శకుధీరుడు రాజమౌళి. ఇది 1920 నాటి ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ మూవీ అని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరంభీలు కలిసి పోరాడితే ఎలా ఉంటుంది అనే కోణంలో అల్లిన కథే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అని ఆర్ ఆర్ ఆర్ కథ స్టోరీ లైన్‌ను మీడియాకి వివరించారు రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈచిత్రం 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే పవర్ ఫుల్ క్యారెక్టర్‌తో ఆర్ ఆర్ ఆర్

రాజమౌళి మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఇద్దరు వీరులు, ఒకరితో ఒకరు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు, ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అయి ఉంటే.. వాళ్ల మధ్య స్నేహం ఏర్పడి ఉంటే ఎలా ఉంటుందనేది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. నా సినిమా కంప్లీట్‌గా ఫిక్షనల్‌గా ఉంటుంది. భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. 1920 లో జరిగే కథ కాబట్టి చాలా పరిశోధన చేశాం. ఆనాటి జీవన విధానం, మనుషుల వ్యక్తిత్వం గురించి చాలా రీసెర్చ్ చేశాం. అందుకే షూటింగ్ స్టార్ట్ చేయడం లేట్ అయింది’ ‘ఇలాంటి పెద్ద హీరోలు ఉన్న సినిమాకి సపోర్టింగ్ కాస్ట్ కూడా ఉండాలి. అజయ్ దేవగన్ గారు సినిమాలో కీలకపాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే పవర్ ఫుల్ క్యారెక్టర్లో ఆయన నటిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. తారక్ సరసన డేజీ అడ్గారియన్స్ నటిస్తోంది. 'ఆర్ ఆర్ ఆర్ ' కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. అయితే ఇదే టైటిల్‌గా బావుందని అంటున్నారు. అన్ని భాషల్లో ఇది కామన్‌గా ఉంటుంది. కానీ ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ ఉంటుంది. నా సినిమాలో యంగ్ అల్లూరి సీతారామరాజుగా చరణ్, యంగ్ కొమరం భీంగా తారక్ కనిపించబోతున్నారు'' అని చెప్పారు రాజమౌళి.

No comments:
Write comments