పీఠాధిపతుల మహాద్వార ప్రవేశాలలో మార్పు లేదు

 

తిరుపతి, మార్చి 13, (globelmedianews.com)
తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వార ప్రవేశానికి సంబంధించి ఒక దినపత్రికలో ప్రచురించిన వార్తలో వాస్తవం లేదని టీటీడీ వివరణ ఇచ్చింది. మఠాధిపతులకు, పీఠాధిపతులకు శ్రీవారి ఆలయ మహాద్వార ప్రవేశ నియమాలలో ఎలాంటి మార్పు లేదు.  ఆలయ మహాద్వార ప్రవేశానికి సంబంధించి మఠాధిపతులు, పీఠాధిపతులే కాకుండా ఇంకా ఎవరెవరు రావచ్చని తెలిపేదే సదరు ప్రభుత్వ ఉత్తర్వుని పేర్కోంది. 


పీఠాధిపతుల మహాద్వార ప్రవేశాలలో మార్పు లేదు

ఆలయ మర్యాదలు పొందే  మఠాధిపతులకు, పీఠాధిపతులకు సంవత్సరానికి ఒకసారి వారితో పాటు ఐదుగురికి మహాద్వార ప్రవేశం ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా వారితో పాటు ఒక సహాయకునికి మహాద్వార ప్రవేశం ఉంటుందని టిటిడి తిరుమల జెఈవో  కె.ఎస్.శ్రీనివాసరాజు స్పష్టం చేశారు.

No comments:
Write comments