మంజీరా జలాలకు కటకట

 

హైద్రాబాద్, మార్చి 12, (globelmedianews.com)
జంటనగరాలలో  మంజీరా జలాలకు కటకట ఏర్పడింది. మంజీరా రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడం... సింగూరు ప్రాజెక్టు అడుగంటడంతో హైదరాబాద్లో చాలా ప్రాంతాలపై ఆ ప్రభావం పడింది.  రక్షణ శాఖ పరిశ్రమలైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు మంజీరా నీళ్ల సరఫరా ఆగిపోయింది.1981 నుంచి బీడీఎల్‌కు మంజీరా నీటిని అందిస్తున్నారు. ఇక్కడ దేశ రక్షణకు కావాల్సిన మిసైళ్లకు రూపకల్పన చేస్తారు. గతంలో పలు మిసైళ్లకు ఇక్కడే అభివృద్ధి చేశారు. ఈ రక్షణ సంస్థకు నీటి అవసరం ఎంతో ఉంది.శాస్త్రవేత్తలు ఇతర ఉద్యోగులు, సిబ్బంది కలిపి దాదాపు 1,500 కుటుంబాలు ఉన్నాయి. ఫ్యాక్టరీతోపాటు ఆ కుటుంబాలకు రోజూ 10 లక్షల కిలోలీటర్ల నీరు అవసరం. 


మంజీరా జలాలకు కటకట

మరో రక్షణ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీదీ అదే పరిస్థితి. యుద్ధ రంగంలో వాడే ట్యాంకర్లను ఇక్కడ తయారు చేస్తారు. 2003 నుంచి జలమండలి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి తాగునీటిని అందిస్తోంది. నిత్యం 5,455 కిలో లీటర్ల మంజీరా జలాలను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సంస్థలకు ఒక్కసారిగా సరఫరా నిలిపివేయడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా మంజీరా, సింగూరు జలాలు బంద్ చేయడంతో ఆ ప్రభావం నగరంలో చాలా ప్రాంతాలపై కనిపిస్తోంది. గతంలో ఈ రెండు జలాశయాల నుంచి నిత్యం 120 ఎంజీడీలు సరఫరా చేసేవారు. రిజర్వాయర్ల నుంచి ప్రస్తుతం చుక్క నీరు రావడం లేదు. కృష్ణా, గోదావరి, జంట జలాశయాల నుంచి తరలిస్తు న్నా ఎటూ సరిపోవడం లేదు.అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. శివార్లతోపాటు ప్రధా న నగరంలో నీటి సరఫరా సక్రమంగా సాగడం లేదు. గతంలో గంటకు పైగా సరఫరా జరిగితే కొన్ని ప్రాంతాల్లో 20- నిమిషాల పాటు సరఫరా తగ్గిం చేశారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి అధికారులు స్పందించి వెం టనే కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని కోరుతున్నారు.

No comments:
Write comments