తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు

 

డూప్లికేటింగ్ కు  నో ఛాన్స్
హైద్రాబాద్, మార్చి 13, (globelmediaenws.com)
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒకే దశలో పోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు రూపొందించడంతో రెండుసార్లు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లేకుండాపోయింది. ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేర్వేరు అయినప్పటికీ ఇంకా రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగినవారు గణనీయ సంఖ్యలోనే ఉన్నారని అభిప్రాయపడిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవల లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలను నిర్వహించినట్లయితే రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదని, తద్వారా పారదర్శకంగా నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు తెలుగు ప్రజలు ఒకే రాష్ట్రంగా ఉన్నందున స్వస్థలంతో పాటు హైదరాబాద్ లాంటి తెలంగాణ నగరాల్లో పనిచేసే చోట కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారని, ఎంత మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారో తేల్చి ఏరివేయడానికి చాలా సమయం పడుతుందని, పూర్తిస్థాయిలో ఇఆర్‌ఓ నెట్ సాఫ్ట్‌వేర్ పనిచేసినట్లయితే ఇది సాధ్యమవుతుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సమయాభావం కారణంగా ఇలాంటి ఓటర్లను గుర్తించడం కష్టమేనని ఆ లేఖలో వివరించారుఒకే రాష్ట్రం పరిధిలో ఉన్నట్లయితే రెండు చోట్ల పేర్లు ఉన్నట్లయితే జాబితా నుంచి తొలగించడం సులువుగా ఉంటుందని, రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్లయితే కొంత సంక్లిష్టమేనని వివరించారు. 


 కీలకం కానున్న తెలుగు ఓటరు

రెండు సార్లు ఓటు హక్కును వినియోగించుకోడానికి అవకాశం లేకుండా చేసి పారదర్శకంగా నిర్వహించాలనుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రోజున పోలింగ్ నిర్వహించడం ఒక మంచి నిర్ణయంగా ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆచరణాత్మక ఇబ్బందులను, సహేతుకమైన కారణంగా భావించిన కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రోజున పోలింగ్ నిర్వహించేలా షెడ్యూలును ఖరారు చేసింది. వచ్చే నెల 11వ తేదీన రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరగనుంది.వచ్చే నెల 11న పోలింగ్ నిర్వహించేలా షెడ్యూలు తయారైంది. మొత్తం ఏడు దశల్లో నిర్వహించనున్న పోలింగ్ వచ్చే నెల 11న మొదటి దశతో ప్రారంభమై మే నెల 19వ తేదీతో ముగుస్తుంది. కెసిఆర్ కోరుకున్నట్లుగానే తొలి దశలోనే రాష్ట్రంలో ఒకేసారి మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలూ పోలింగ్ పూర్తి కానుండడంతో తదుపరి జరిగే వివిధ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించడానికి వీలు కలిగింది.మరోవైపు పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే పరిపాలనా సంబంధమైన అంశాలపై దృష్టి పెట్టడానికి, వివిధ పనులకు సంబంధించిన సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి తగిన సమయం లభించనుంది. జూన్ చివరికల్లా రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, సహకార సొసైటీలు, పట్టణ స్థానిక సంస్థలు ఇలా అన్ని రకాల ఎన్నికలను ముగించి జూలై మాసం నుంచి పూర్తిగా పరిపాలనపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లుగానే షెడ్యూలు రూపొందడం ఒకింత ఉపశమనం

No comments:
Write comments