సర్వీస్ టూ ది నేషన్..!

 

సర్వీస్ టూ ది పీపుల్స్..!!
- సిద్ధిపేట మెడికల్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు మార్గ దిశానిర్దేశం చేసిన రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు, ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్.జీ.ఎన్.రావు
సిద్ధిపేట, మార్చి 08 (globelmedianews.com
ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రుల ద్వారా 26 లక్షల మిలియన్ల ప్రజలకు 50 శాతం ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. దక్షిణ భారత దేశంలోని 4 రాష్ట్రాలలో 200 ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రులు ఉన్నాయి. ఇంత వయస్సులో జీ.వీ.రావు గారు రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పని చేస్తారని, మనకంటే.. ఎక్కువగా కష్ట పడతారని.. ఇవాళ యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. సర్వీస్ టూ ది నేషన్.. సర్వీస్ టూ ది పీపుల్స్..గొప్ప సేవా భావం కలిగిన వారని ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి డాక్టర్ జీ.ఎన్.రావు లాంటి వాళ్లు మీలో ఎంతో మంది కావాలని రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు మెడికల్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు మార్గ దిశానిర్దేశం చేశారు.అంతకు ముందు ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్. జీ.ఎన్.రావు విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రీసెర్చ్ చేస్తే మెడికల్ సైన్సుకు హెల్ప్ అవుతుందని, మీరు బయటకు వెళ్లిన తర్వాత ఏంబీబీఎస్ తర్వాత చెయ్యడానికి మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని విద్యార్థులకు సూచనలు చేశారు. 


సర్వీస్ టూ ది నేషన్..!

కొందరు పబ్లిక్ హెల్త్ లోకి వెళ్లొచ్చని., మీరంతా హరీశ్ రావు సారులా.. గొప్ప వాళ్లు కావాలని, ప్రజలకు సేవ చేయాలని విద్యార్థినీ, విద్యార్థులను కోరారు. మీరు ఇక్కడి కళాశాలలో చదివి వెళ్లిన తర్వాత ఇంకా మంచి ఇన్సిట్యూట్స్ లో వెళ్లి చదవాలని ఆకాంక్షించారు. రీసెర్చల్ చేసేందుకు కోసం ఎన్నో ఇన్సిట్యూట్స్ ఉన్నాయని., మీలో కొంత మంది ఆ ఇన్సిట్యూట్లో చేరాలని సూచించారు. పలువురు విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని అందరూ డాక్టరుగానే కాకుండా ప్రతి సమ్మర్ లో ల్యాబులో టైమ్ కేటాయించి మెడికల్ సైన్స్ కు ఎదుగుదలను ఇవ్వొచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు. రీసెర్చ్ చేస్తే మొదటి సారే విజయం వస్తుందని.. అనుకోవద్దని., అపజయాలు కలిగినా.. ఇంకా ప్రయత్నిస్తూనే ఉండాలని విద్యార్థినీ, విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మీరు చదువుకునే చదువు ఎంతో విలువైందని., దానిని సరైన రీతిలో పూర్తి చేయాలని.. నిరు పేదలకు సేవ చేయడమే డాక్టర్ లక్ష్యమని చెప్పారు. అంతకు ముందు మెడికల్ కళాశాల, జిల్లా ఏరియా ఆసుపత్రిలోని ఎస్ఎన్ సీయూ, పేషెంట్ వార్డులు, ఆపరేషన్ కాంప్లెక్స్ లను సందర్శించి అక్కడి రోగులతో వైద్యం అందిస్తున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని పేషెంట్ వార్డులో దుద్దెడ మధిర గ్రామ రాంపల్లి గ్రామానికి చెందిన లచ్చవ్వతో వైద్యం అందిన తీరుపై ఆరా తీశారు. ఈ మేరకు లచ్చవ్వ మా కోడలు ఆరోగ్యం మంచిగ లేకపోతే వచ్చానని., ఈ ఆసుపత్రిలో మంచిగ సౌలత్ లు ఉన్నాయని చెబుతూ.. అన్నీ ఇక్కడే మంచిగ చేసిండ్రని చెప్పింది. ఈ ఆసుపత్రిలో హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్తకు కూడ అన్నం పెట్టినం తిన్నవా.. అని హరీశ్ ఆరా తీయగా.. తిన్నాం.. సారూ.. అంటూ బదులిస్తూ.. ఇంతకు ముందులా దవాఖాన లేదని.. ఇప్పుడు అద్దమొలే మంచిగైందని బదులివ్వడంతో.. హరీశ్ రావు, ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి ఛైర్మన్, అక్కడి వైద్యాధికారుల ముఖంలో నవ్వులు చిగురించాయి. 

No comments:
Write comments