ప్రభుత్వానికి పట్ట భద్రులకు వారధిగా వుంటా

 

ఎమ్మెల్సీ అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్
సిద్దిపేట ,మార్చి12: (globelmedianews.com
ప్రభుత్వానికి పట్ట భద్రులకు వారధిగా పని చేస్తానని కరీంనగర్ పట్ట భద్రుల నియోజకవర్గం టిఆర్ఎస్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. సిద్దిపేట స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  మాట్లాడుతూకాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి జీవన్ రెడ్డి ది ప్రజా గొంతు కాదు అధికార దాహ గొంతుకని   అన్నారు.  రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే అధికార పార్టీ బలపరిచిన తనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.


 ప్రభుత్వానికి పట్ట భద్రులకు వారధిగా వుంటా

ఇదివరకే ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కేటీఆర్,  హరీష్ రావు తదితర నాయకులతో చర్చలు జరిపానని వారు ఎంపి ఎలక్షన్ల అనంతరం ఆయా సమస్యలపై పరిష్కారం దిశగా కృషి చేస్తామని మాకు స్పష్టమైన హామీ ఇచ్చారని అన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ట్రస్మా రాష్ట్ర నాయకత్వం  తనకు మద్దతు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ మెదక్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన చంద్రశేఖర్ గౌడ్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చంద్రశేఖర్ గౌడ్ ఎమ్మెల్సీ బరిలో దిగడానికి తాను ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉండగానే గ్రూప్ వన్ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం  ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దిగారని అన్నారు. కాబట్టి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును చంద్రశేఖర్ గౌడ్ వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.
ఈ మీడియా సమావేశంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు సుభాష్,  టౌన్ వైస్ ప్రెసిడెంట్ నాచగొని  సత్యం గౌడ్, రాజేశ్వర్ రెడ్ది, బాలకృష్ణ, యాదగిరి, రవి, సికిందర్, రవి, మోహన్, సికిందర్, సలీమ్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments