పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదు.. ప్రమాదవశాత్తూ జరిగింది

 

 పుల్వామా ఉగ్రదాడిపై దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ మార్చ్ 5 (globelmedianews.com
పుల్వామా ఉగ్రదాడిపై కాంగ్రెస్ సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ (డిగ్గీ రాజా) సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో జరిగింది అసలు ఉగ్రదాడియే కాదని.. కేవలం అది ప్రమాదవశాత్తూ జరిగిందని వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయు సేన దాడి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ అసమాన దాడి తాలూక క్రెడిట్ ను బీజేపీ తన ఖాతాలో వేసుకోగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం అసలు దాడే జరగలేదంటూ బీజేపీని ఎండగడుతోంది.. 


పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదు.. ప్రమాదవశాత్తూ జరిగింది

ఇలా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఇప్పుడు మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది.బీజేపీ ప్రభుత్వం పుల్వామా అనంతరం చేసిన దాడులతో లబ్ధి పొందాలని చూస్తోందని దిగ్విజయ్ మండిపడ్డారు. కేంద్రం తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందని ఆయన స్పష్టం చేశారు.భారత వాయుసేన దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారన్నది లెక్కతేలలేదని.. ఒక్కో బీజేపీ నేత ఒక్కో సంఖ్య చెబుతున్నారని దిగ్విజయ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ సైతం అధికారికంగా ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలని డిగ్గీ డిమాండ్ చేశారు. 250మందిని చంపామని అమిత్ షా అంటున్నాడని.. 500మంది యూపీ సీఎం యోగి అంటున్నాడని.. మోడీ 300 మంది అంటున్నాడని... ఎంత మందిని చంపారో చెప్పాలని దిగ్విజయ్ వరుస ట్వీట్లు చేస్తూ బీజేపీని నిలదీశారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ కూడా బాలాకోట్ పై జరిగిన ఉగ్రవాద దాడులకు ఆధారాలు చూపించాలని బీజేపీని కోరారు. 

No comments:
Write comments