పాకిస్తాన్ కు ఇరాన్ వార్నింగ్

 

న్యూఢిల్లీ, మార్చి 9, (globelmedianews.com)
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరిగింది. ఉగ్రవాద స్థావరాలపై ఉక్కుపాదం మోపాల్సిందిగా అమెరికా, రష్యా సహా పలు దేశాలు హెచ్చరించాయి. ఈ క్రమంలోనే భారత్ వైమానిక దాడులు చేయడంతో పాకిస్తాన్ ఖంగుతింది. ఏకంగా పాక్ భూభాగంలోకి దూసుకొచ్చి జైషే మహ్మద్ క్యాంపులను ధ్వంసం చేయడంతో షాక్‌లోకి వెళ్లిపోయింది. అయితే అంతర్జాతీయంగా పరువు పోతుందనే ఉద్దేశంతో పాకిస్తాన్ భారత్ చేసిన దాడులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది.అసలు బాలకోట్‌లో ఉగ్రవాద స్థావరాలే లేవని, వైమానిక దాడుల్లో చెట్లు మాత్రమే దెబ్బతిన్నాయని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు మద్దతుగా పాకిస్తాన్‌ను ఇరాన్ హెచ్చరించింది. దేశంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని లేదంటే భారత్ తరహాలో దాడులు చేస్తామని హెచ్చరించింది.ఉగ్రవాద నిర్మూలన కోసం కలిసి పనిచేయాలని గతంలోనే ఇరాన్, ఇండియా నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాదాన్ని అణచివేసే అంశంపై తదుపరి దశ చర్యలు జరపబోతున్నాయి. 

పాకిస్తాన్ కు ఇరాన్ వార్నింగ్

వాస్తవానికి గత వారమే భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఇరాన్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.త్వరలోనే ఆయన ఇరాన్ వెళ్లే అవకాశముంది. కాగా బలూచిస్థాన్ కేంద్రంగానూ పాకిస్తాన్ పలు ఉగ్రవాద సంస్థలకు సహకారమిస్తున్నట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా జైష్ అలాదిల్ సంస్థ పాక్ మద్దతుతోనే ఇరాన్‌లో అలజడులు సృష్టిస్తోందని మండిపడుతోంది. ఈ క్రమంలోనే భారత్ తరహాలో దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతోంది.ఇరాన్ ఖుద్స్‌ఫోర్స్ జనరల్ ఖస్సీం సోలెమాని మాట్లాడుతూ, పాకిస్తాన్ పొరుగు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోందని విమర్శించారు. పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయి. కానీ వందలాది మంది టెర్రరిస్టులు ఉన్న ఉగ్రవాద స్థావరాలను మాత్రం ధ్వంసం చేయలేకపోతున్నారు. జైష్ అలాజోమ్(ఇరాన్లో జైష్ అలాదిల్) ఉగ్రవాద సంస్థకు ఐఎస్‌ఐ మద్దతిస్తోంది.దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాద శిబిరాలు ఎక్కడ ఉన్నాయో పాకిస్తాన్‌కు తెలిసినా మౌనంగా ఉంటూ ఉగ్రవాదాన్ని పావుగా వాడుకుంటున్నారు. భారత వైమానిక దళాలు బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయని, అయితే ఆ పని గతంలో చేయాల్సిందన్నారు. మేకుం జైషే అలాదిల్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

No comments:
Write comments