ఉన్న‌దీపోయే..ఉంచుకున్న‌దీ పోయే.. న‌డిరోడ్డుపై అలీ

 

హైదరాబాద్ మార్చ్ 18  (globelmedianews.com)
ఎంద‌రో నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురింపించిన క‌మెడియ‌న్ అలీ రాజ‌కీయ రంగంలోకి అడుగు పెట్టీ పెట్ట‌గానే అభాసు పాల‌య్యాడు. ఎం ఎల్ ఏ అయి ఆ త‌ర్వాత మంత్రి అయిపోదామ‌ని క‌ల‌లు క‌న్న అలీ అస‌లు ఏమీ కాకుండా ఏ పార్టీలో ఉండాలో అర్ధం కాకుండా న‌డిరోడ్డుపై ఉండిపోయాడు. ఉన్న‌దీపోయే…ఉంచుకున్న‌దీ పోయే అనేది సామెత‌ లా మారింది అతని పరిస్థితి. ఇదేదో మ‌న‌కు సంబంధం లేదులే అనుకున్నాడు సినీన‌టుడు అలీ. సినీ ప‌రిశ్ర‌మ‌లో అలీ చిరంజీవికి, ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఎంతో స‌న్నిహితుడు. ఇంత సాన్నిహిత్యం ఉన్న వ్య‌క్తి పార్టీ పెడితే ఎవ‌రితో చెప్ప‌కుండా అక్క‌డ చేరిపోవాలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోర‌లేదు కాబ‌ట్టి నేను జ‌న‌సేన‌లో చేర‌లేదు అని దారుణ‌మైన వ్యాఖ్య చేసిన అలీ టిడిపి పిల‌వ‌క‌పోయినా ఆ పంచ‌న చేరేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. పోనీ అందులోనైనా నిల‌క‌డ‌గా ఒక రోజైనా ఉన్నాడా అంటే అదీలేదు. 24 గంట‌ల్లో పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. అలీ సడన్ గా వైఎస్సార్ సీపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. జనసేన, వైసీపీ, టీడీపీల చుట్టూ కథ తిరిగి.. క్లైమాక్స్ మాత్రం వైసీపీ దగ్గర ముగింపున‌కు చేరింది. 


ఉన్న‌దీపోయే..ఉంచుకున్న‌దీ పోయే.. న‌డిరోడ్డుపై అలీ

అయితే.. ఆయన వైసీపీలో చేరక ముందు.. చేరిన తర్వాత చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి పదవిపై హామీ ఇస్తేనే ఏ పార్టీలోకి అయినా వెళతానని గతంలో బల్లగుద్ది చెప్పిన అలీ వైసీపీలో చేరిన అనంతరం పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించడం ఆయన సన్నిహితులను విస్మయానికి గురి చేసింది. అలీ ఆశిస్తున్న స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కావడంతో అలీ తన తదుపరి ఆప్షన్‌గా వైసీపీని ఎంచుకున్నట్లు తెలిసింది. అయితే.. వైసీపీలో కూడా అలీకి టికెట్‌ దక్కలేదు. వైసీపీ ఒకవేళ అధికారాన్ని చేజిక్కుంచుకుని మంత్రి మండలిని ఏర్పాటు చేసినా ఎమ్మెల్సీ కోటాలో అలీకి మంత్రి పదవి దక్కుతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అందుకు కారణం లేకపోలేదు. వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆశావహుల సంఖ్య చేంతాడంత ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిలో మైనార్టీ నేతలు కూడా తక్కువ మందేమీ లేరు. అంత మందికి దాటుకుని అలీకి మంత్రి పదవి ఎంతవరకూ దక్కుతుందనే ప్రశ్నకు ప్రస్తుతం కచ్చితమైన సమాధానం దొరకని పరిస్థితి. అదంతా పెద్ద క‌థ‌. ఇప్ప‌టికైతే ఎక్క‌డా సీటు రాని విఫ‌ల రాజ‌కీయ నేత‌గా అలీ మిగిలిపోయాడు. ఎం చ‌క్కా జ‌న‌సేన పార్టీలోనే ఉన్న‌ట్ల‌యితే క‌చ్చితంగా సీటు వ‌చ్చి ఉండేది. మ‌రీ సుడితిగితే గెలిచేవాడు. ఇంకా బ్ర‌హ్మాండంగా సుడి తిరిగితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి అయితే అలీ మంత్రి కూడా అయి ఉండేవాడు. అన్నీ పోయి ఇప్పుడు తాలు మాదిరిగా మిగిలిపోయాడు పాపం అలీ.

No comments:
Write comments