అశోక్ కు హైకోర్టులో షాక్

 

హైద్రాబాద్మార్చి 11 (globelmedianews.com)
ఐటీ గ్రిడ్స్ కేసులో  సంస్థ ఎండీ డాకవరపు అశోక్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైందిహైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు అశోక్ సమాధానం చెప్పాల్సిందిగాకోర్టు  ఆదేశించిందిఐటీ గ్రిడ్స్పై విచారణ కొనసాగించాలని పోలీసులకు సూచించిందితెలంగాణ పోలీసులకు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా అశోక్ వేసిన క్వాష్ పిటిషన్పైహైకోర్టు  సోమవారం  విచారణ చేపట్టిందిసుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి సిద్ధార్థ్ లుత్రా.. అశోక్ తరఫున హైకోర్టులు వాదనలు వినిపించారుకేసు విచారణకు తెలంగాణ పోలీసులకు సహకరించడానికి అశోక్ సిద్ధంగా ఉన్నారని.. కానీపోలీసులు వేధిస్తున్న కారణంగానే ఆయన ముందుకు రావట్లేదని లాయర్ తెలిపారుఐటీ గ్రిడ్స్ భద్రపరిచినదంతా ఏపీకి సంబంధించిన డేటా అని.. అందువల్ల కేసును ఏపీకి బదలాయించాలని కోరారుతెలంగాణలో విచారణ సరిగా జరగదని చెప్పారు


అశోక్ కు హైకోర్టులో షాక్
తెలంగాణప్రభుత్వంతరఫున వాదించిన న్యాయవాది  వాదనను వ్యతిరేకించారుతెలంగాణ పోలీసులు ఇచ్చిన  నోటీసులకు కూడా అశోక్ స్పందించలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారుఐటీ గ్రిడ్స్ డేటా చోరీ వ్యవహారంలో అశోక్ ప్రధాన నిందితుడనీ.. ఆయణ్ని విచారిస్తేనే కేసుకు సంబంధించిన కీలక వివరాలు తెలిసే అవకాశం ఉందని వివరించారుఅశోక్‌ ను అరెస్టు చేయడానికి ప్రయత్నించలేదని వెల్లడించారుఐటీ గ్రిడ్స్ కేసు విచారిస్తున్న సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర సహా పోలీసు అధికారులంతా కోర్టుకు వచ్చారుఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. కేసు విచారణలో తెలంగాణ పోలీసులకు అశోక్ సహకరించాలని సూచించిందికేసు విచారణ కొనసాగించాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించిందితదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేసింది.డేటా చోరీ వ్యవహారంలో ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసినవెంటనే   సంస్థ సీఈఓ అశోక్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారుతెలంగాణ పోలీసులు తన సంస్థపై తనపై వేసిన కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారుమేరకు క్వాష్  పిటిషన్‌ దాఖలు చేశారుతానుతన సంస్థ ఎలాంటి డేటా చోరీకి పాల్పడలేదని.. కేవలం వ్యాపారపరమైన లావాదేవీలు మాత్రమే జరిగాయని అశోక్ తనపిటిషన్లో  పేర్కొన్నారు.

No comments:
Write comments