అశోక్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపు

 

హైద్రాబాద్, మార్చి 8 (globelmedianews.com)
డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ చైర్మన్ దాకవరపు అశోక్ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా కొద్దిరోజుల క్రితమే ఐటీ గ్రిడ్ ఆఫీసులో తనిఖీలు చేపట్టిన పోలీసులు మరోసారి సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే తాము స్వాధీనం చేసుకున్న డేటాను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే పరారీలో ఉన్న సంస్థ ఎండీ అశోక్ మాత్రం తెలంగాణ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. అతడిని పట్టుకుంటేనే ఈ కేసు మరింత పురోగతి సాధిస్తుందన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. 


అశోక్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపు

అశోక్ కోసం ప్రస్తుతం మూడు టీమ్ లు గాలిస్తున్నాయి. అశోక్ కు సంబంధించి కీలక సమాచారం అందిందని, రెండ్రోజుల్లో అతడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్ నుంచి సేకరించిన డేటా ద్వారా కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన కొందరి ఓటర్ ఐడీలతో పాటు మరికొంత కీలక డేటా ఐటీ గ్రిడ్ సంస్థ సేకరించినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో మరిన్ని వివరాలు మీడియాకు అందిస్తామని పోలీసులు చెబుతున్నారు. అశోక్ పై సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచిపోకుండా ఎల్వోసీ జారీచేయడంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశారు. తమ ముందు దర్యాప్తునకు హాజరుకావడానికి పోలీసులు ఇచ్చిన సమయం మంగళవారంతో పూర్తికావడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. 

No comments:
Write comments