వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి

 

 జిల్లా కలెక్టర్ డా.ఏ. శరత్
జగిత్యాల మార్చి 7:(globelmedianews.com)  
పదవతరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ డా.ఏ. శరత్  సూచించారు. గురువారం జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో పదోతరగతి పరీక్షలపై స్థానిక ఎల్ జి గార్డెన్ లో కలెక్టర్ పాఠశాలల వారిగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఈ తక్కువ సమయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఉత్తీర్ణత పై దృష్టిసారించాలని తెలిపారు. పరీక్షలపై విద్యార్థుల లో ఉన్న అనుమానాలను తెలుసుకొని వాటిని నివృత్తి చేయాలని, పరీక్షలు రాసే సమయంలో ఏ విధంగా కృషి చేస్తారో, అదేవిధంగా కృషి చేయాలని అన్నారు. 


వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి

ప్రతిరోజు వేకప్ కాల్స్ ద్వారా విద్యార్థులను ఉదయం నిద్ర లేపి చదివించాలని, సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ప్రత్యేక తరగతులను నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు దగ్గరుండి చదివించాలని, వారికి కావలసిన టిఫిన్, భోజనము ఖర్చులను చెల్లిస్తామని పేర్కొన్నారు. పరీక్షల సమయం ఎంతో విలువైందని, ఉపాధ్యాయులు అత్యవసర సమయం మినహా ఏ విధమైన సెలవులు పెట్టకూడదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులందరూ ఒక టీమ్ గా ఏర్పడి ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా పనిచేసి గత రెండు సంవత్సరాల కంటే ముచ్చటగా మూడోసారి కూడా జగిత్యాల జిల్లా ను తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపి ఉద్యోగ ధర్మాన్న నిరూపించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవోలు, మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments