రియల్ దందాపై పోలీసులు గురి

 

నల్లగొండ, మార్చి 9, (globelmedianews.com
రియల్ వ్యాపారుల మోసాలపై పోలీసులు దృష్టిసారిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరిట సామాన్య, మధ్యతరగతి వారిని టార్గెట్‌గా చేసుకుని కోట్లాది రూపాయలు మోసం చేస్తున్న ఘటనలు నానాటికీ పెరుగుతుండటంతో రియాల్టర్లపై ప్రత్యేక దృష్టిసారించాలని పోలీసు ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులు సూచలిస్తున్నారు. ఇటీవల కాలంలో నగర శివారుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల కాకుండా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రియల్ వ్యాపారం ఊపందుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో 33 జిల్లాలను ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయా జిల్లా కేంద్రాలలో వెంచర్లను ప్రారంభిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఈక్రమంలో రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదాయం పెరిగింది. నగర శివారులు, పలు జిల్లాలలో ముఖ్య పరిశ్రమలు రానుండటంతో రియల్ దందా మరింత పెరిగింది.వెంచర్లు వేసిన రియల్టార్లు సర్వే నంబరు మార్చి మరొకరి విక్రయించిన ఘటనలతో బాధితులు తమకు అన్యాయం జరిగిందని పోలీసులను ఆశ్రయిస్తున్నారని పోలీసు అధికారులు వివరిస్తున్నారు. మధ్యతరగతి వారు సొంత ఇంటి నిర్మాణం కోసం స్థలా లు, ఆపై ఇళ-్ల కట్టుకోవాలనుకునే వారిని కొందరు రియ ల్ వ్యాపారులు నిలువునా ముంచేస్తున్న విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.  రియల్ దందాపై పోలీసులు గురి

స్థలాల కొనుగోలులో అవగాహణ లేని వారిని టార్గెట్‌గా చేసుకుని రియాల్టర్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.నగర, శివారుల్లో వెలుస్తున్న వెంచర్లలో దాదాపు 80 శాతం నిబంధనలకు విరుద్దంగానే ఉన్నాయన్నది సత్యదూరం కాదు. ఏమాత్రం లే అవుట్ పర్మిషన్ లేకుండా, నాలా పన్నులు చెల్లించకుండా, అనుమతి లేకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఈ విష యం ఆ శాఖ అధికారులకు తెలిసినా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈక్రమంలో రాజకీయ నాయకుల ప్రమేయం కారణంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం వెనకడుగువేస్తున్నారు. ఆదిబట్లలో గత నాలుగేళ్లుగా రియల్ పరుగులు పెడుతోంది. టిసిఎస్, కాగ్నిజెంట్, కన్వెర్జిస్ వంటి బడా సంస్థ లు రావడంతో రియల్ భూం మరింత ఊపందుకుంది. దేశంలోనే తొలి టాటా ఎయిర్‌స్పేస్ సెజ్‌కు ఆదిబట్ల ఎంపిక కావడంతో రియల్ వ్యాపారం జోరందుకుంది. యాదగిరిగుట్టలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. అలాగే ఇబ్రహీంపట్నం, యాంజాల్, మన్నెగూడా క్రాస్‌రోడ్, బొంగ్లూరు, కొంగరకలాన్, మంగల్‌పల్లి ప్రాంతాలలో సైతం భూముల రేట్లు చెప్పతరం కాకుండా ఉన్నా యి.ఆదిబట్ల ప్రాంతంలో ఐటి, వైమానిక తయారీ కంపెనీలు, డిఫెన్స్ కంపెనీలు విస్తరిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ఎయిర్‌స్పేస్ సెజ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టవ్‌‌సు, మార్టిన్, సమూహ వంటి సంస్థలున్నాయి, ఇదివరలోనే బీడీఎల్, అక్టోపస్,బెల్, ఎస్‌ఎన్‌జి, సీఆర్‌పిఎఫ్ వంటి కేంద్ర సంస్థల విస్తరణకు గాను ఈ ప్రాంతాలలో భూములు కేటాయించారు. దీంతో మధ్య తరగతి, సామాన్యులు ఈ ప్రాం తంలో ఫ్లాట్ల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలావుండగా తమను మోసాం చేశారంటూ ప్రతి రోజూ సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల చూట్టు వందలాది మంది బాధితులు తిరుగుతూనే -ఉన్నారు. ఈ క్రమంలో బాధితులకు పోలీసులు సైతం తగిన విధంగా సూచనలిస్తున్నారు.
ముఖ్యంగా ప్లాట్ యజమాని ప్లాట్ ఎందుకు అమ్ముతున్నాడో? ముందుగా సమాచారం సేకరించాలి. చట్టపరమైన సమస్యలేమైనా -ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీయాలి. చట్టపరమైన సమస్యలు ఉన్న కారణంగా ప్లాటు విక్రయిస్తున్నాడా అన్నది తెలుసుకోవాలి. ఆ ప్లాట్‌పై ఎవరికైనా ఉమ్మడి హక్కులున్నాయా? అన్న కారణాలను ఆన్వేశించాలి. అదేవిధంగా కొనుగోలు చేస్తున్న ప్లాట్, ఇంటిపై పాత రుణాలు ఏమైనా ఉన్నాయా? బ్యాంకు నుంచి తీసు న్న ఎన్‌ఒసి పత్రాలను సరిచూసుకోవాల్సిన బాధ్యత కొనుగోలు దారునిదే. ప్లాటు బ్యాంకులో తనఖాలో -ఉంటే దానిపై తీసుకున్న రుణం మొత్తాలకు సంబంధించి ఎన్‌ఒసి పత్రాలను పరిశీలించిన అనంతరం ఫ్లాట్ డాక్యూమెంట్ స్వాధీనం చేసుకోవాలి. కొనుగోలు దారులు అప్రమత్తతోనే రియల్ చీటింగ్‌కు కళ్లెం వేయవచ్చని ఫిర్యాదు దారులకు పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.
రియల్ మోసాలకు సంబంధించి కోర్టు ల్లో కేసులు ఉన్న నేపథ్యంలో కొన్న చర్యలకు వెనకడుగు వేస్తున్నామని కొందరు పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ల్యాండ్ కేసులకు సంబంధించి డ్యాక్యూమెంట్ సెల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కోర్టులో ఉన్న కేసులు కాకుండా పోలీసు శాఖ పరిధిలోని భూముల కేసులను పరిష్కరించేందుకు న్యాయ నిపుణుల సలహా మేరకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాలు, శివారుల్లో ఊపందుకున్న రియల్ భూంలో బాధితులను దృష్టిలో ఉంచుకుని డాక్యూమెంట్ సెల్‌ను ఏర్పాటు చేసే దిశగా పోలీసు శాఖ అడుగులు వేస్తోండటం అభినందనీయం.

No comments:
Write comments