రాప్తాడులో పరిటాల సునీత ప్రచారం

 

అనంతపురం, మార్చి 13, (globelmedianews.com)
అనంతపురం జిల్లా  రాప్తాడు నియోజకవర్గ ఎన్నికల ప్రచారాన్ని మంత్రి పరిలా సునీత బుధవారం ప్రారంభించారు. తన  స్వగ్రామం వెంకటాపురంలోని నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పరిటాల రవీంద్ర ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించారు. తరువాత ముత్తవకుంట్లకు బయలుదేరారు. ఆమె వెంట పరిటాల శ్రీరామ్ కుడా ప్రచారంలో పాల్గోన్నారు.  ప్రచార రధ సారధిగా పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్దార్ధ వ్యవహరించారు.  


రాప్తాడులో పరిటాల సునీత ప్రచారం

నసనకోట తిరుమలదేవర దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిని సునీత  కనగానపల్లి మండలం, ముత్తవకుంట్ల నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముత్తవకుంట్ల చేరుకున్న పరిటాల సునీత కు తెదేపా శ్రేణులు, పరిటాల అభిమానులు, గ్రామస్ధులు ఘన స్వాగతం పలికారు. పరిటాల రవీంద్ర  ఎన్నికల్లో పోటీ చేసిన సమయం నుండి కనగానపల్లి మండలం, ముత్తవకుంట్ల నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా జరుగుతోంది.  ఇదే ఆనవాయితీగా సునీత కుడా ముత్తవకుంట్ల నుండి ఎన్నికల ప్రచారాన్ని  ప్రారంభించారు.

No comments:
Write comments