లోటస్‌ పాండ్‌ వద్ద వైకాపా ఎమ్మెల్యేకు చేదుఅనుభవం

 

హైదరాబాద్‌ మార్చ్ 12 (globelmedianews.com)
వైకాపాకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ కు హైదరాబాద్‌లోని ఆ పార్టీ అధినేత జగన్‌ నివాసం లోటస్‌పాండ్‌ వద్ద చేదు అనుభవం ఎదురైంది. జగన్‌ను కలిసేందుకు తన సతీమణితో కలిసి వచ్చిన ఎమ్మెల్యేను లోటస్‌ పాండ్‌ లోకి అనుమతించేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. జగన్‌ ను కలిసేందుకు మూడు రోజులుగా సునీల్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. 


లోటస్‌ పాండ్‌ వద్ద వైకాపా ఎమ్మెల్యేకు చేదుఅనుభవం

ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం జగన్‌ నివాసం వద్దకు వచ్చి రెండు గంటలుగా పడిగాపులు కాసినప్పటికీ అనుమతించలేదు. ఈసారి సీటు దక్కకపోవచ్చన్న వూహాగానాల నేపథ్యంలో  పార్టీ అధినేతను కలిసి మాట్లాడేందుకు సునీల్‌ ప్రయత్నిస్తున్నారు. జగన్‌ నివాసం వద్ద వేచిచూస్తున్న సమయంలో వైకాపా సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోపలికి వెళ్తుండగా ఆయనను కలిసేందుకు ప్రయత్నించినా ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా జగన్‌ నివాసంలోకి వెళ్లిపోయారు. దీంతో సునీల్‌ మనస్తాపానికి గురైనట్టు సమాచారం. మరోవైపు వరుస సమావేశాలు ఉన్నందున త్వరలో పిలుస్తామని వైకాపా కార్యాలయ నేతలు సునీల్‌కు చెప్పినట్టు తెలుస్తోంది

No comments:
Write comments