భారీగా పెరుగుతున్న కరెంట్ డిమాండ్

 

హైద్రాబాద్, మార్చి 4, (globelmedianews.com)
ఎండలు ఫిబ్రవరి మాసం నుంచే ప్రభావం చూపుతుండడంతో, విద్యుత్ డిమాండ్ కూడా రాష్ట్రవ్యాప్తంగా అదే స్థాయిలో పెరుగుతోంది. ఫిబ్రవ రి చివరి వారంలోనే 10 వేల మెగావాట్లకు విద్యుత్ పీక్ డిమాండ్ చేరుకుంది. గతేడాది ఏప్రిల్ 1వ తేదీన 8500 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదు కాగా, ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికే 10,019 మెగావాట్లకు చేరుకుంది. ఫిబ్రవరి చివరి వారం నుంచే డిమాండ్ పెరగడం మొదలైంది. రాను న్న మూడు నెలల్లో విద్యుత్ డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేసే యంత్రాంగాన్ని పటిష్టం చేయడంపై అధికారులు నిమగ్నమయ్యారు. వ్యవసాయానికి రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నందున మొత్తం విద్యుత్ సరఫరాలో వ్యవసాయ డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.గృహ విద్యుత్ వినియోగం సైతం బాగానే పెరగుతుందని, ఎసిలు, రిఫ్రిజరేటర్లు, ఫ్యాన్లు, ఇతర కూలింగ్ పరికరాల వినియోగం ఊపందుకుంటుందని, దీంతో విద్యుత్ డిమాండ్ ఎక్కువవుతుందని అంచనా వేశారు. 


భారీగా పెరుగుతున్న కరెంట్ డిమాండ్

ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో కేవలం 8 వేల మెగావాట్లలోపే ఉన్న డిమాండ్ 18వ తేదీ నుంచి 9000 మెగావాట్లు దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 9 వేల పైనే గరిష్ట డిమాండ్ నమోదవుతూ ఉంది. గత నెల 25వ తేదీన 9900 మెగావాట్లు చేరిన డిమాండ్ ఆ మరుసటి రోజుకే 10 వేల మెగావాట్లకు చేరుకుంది. మార్చి 2వ తేదీన కూడా 10 వేల మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. మొత్తంగా 214.5 మిలియన్ యూనిట్ల డిమాండ్‌కు తగ్గట్లుగా కరెంటు సరఫరా అయ్యింది. ఇందులో జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రం 58.1 ఎంయులు, జలవిద్యుత్ కేంద్రం నుంచి 1.9 ఎంయులు సరఫరా కాగా, సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి 27.4 ఎంయుల కరెంటు సమకూరింది. కేంద్ర విద్యుత్ సంస్థలు, ఇతర కొనుగోళ్ల ద్వారా 102.3 ఎంయులు, విద్యుత్ ఎక్సేంజిలు, సౌర, పవన విద్యుత్‌లతో 24.1 ఎంయుల కరెంటును ట్రాన్స్‌కో, డిస్కంలు సమకూర్చి, కోతలు లేని విద్యుత్‌ను సరఫరా చేశారు. ఎండలు ముదురుతున్నాకొద్దీ డిమాండ్‌ను తట్టుకుని సరఫరా చేయడంపై ట్రాన్స్‌కో అధికారులు ప్రణాళిక తయారు చేశారు.గా రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉన్న కరెంటు సరఫరా లైన్లకు రెట్టింపు సంఖ్యలో ఈ నాలుగేళ్లలో ప్రణాళికా బద్ధంగా వేలాది సర్కూట్ కిలోమీటర్ల మేర లైన్లను నిర్మించారు. దీంతోనే డిమాండ్ 10 వేల మెగావాట్లు దాటినా వ్యవస్థ తట్టుకుంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

No comments:
Write comments