శాంతి భద్రతల పరిరక్షణ కు కార్డన్ సెర్చ్

 

నిర్మల్,మార్చ్,20 (globelmedianews.com)
ప్రజల భద్రత కోసం మరియు ప్రజలకు పోలీసు శాఖ  మరింత దగ్గర అవడం కోసం  కార్దన్ సర్చ్ లు  నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు  అన్నారు. బుధవారం సారంగాపూర్ మండలంలోని చించోలి గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.ముందస్తు నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ,  జిల్లా ప్రజలకు వారి రక్షణ పట్ల ఎటువంటి బయాందోళనలు లేకుండా భరోసా కలిగించాడనికి ఈ  కార్దన్ సర్చ్ నిర్వహించామని అయన అన్నారు.  


శాంతి భద్రతల పరిరక్షణ కు కార్డన్ సెర్చ్

ఈ సోదాల్లో వంద మంది పొలిసు సిబ్బందితో సుమారు గ్రామాలోని ఇళ్లను ముమ్మర తనిఖీ చేసారు. సరైలన అనుమతిలేని 4 ద్విచక్ర వాహనాలు, 03 ఆటోలు  స్వాధీనం చేసుకున్నారు. ఈ  సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పటిష్టమైన నేర నివారణ చర్యలలో భాగంగా  కాలనీలోని ముఖ్య కూడలిల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అత్యవసర సమయములో అయినా  100 నెంబర్ కు గాని, సమీప పోలీస్ స్టేషన్ కు గాని సమాచారము అంధించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని, సరియైన పత్రాలు లేనివారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి.ఉపేంద్ర రెడ్డి, సి.ఐ.లు  జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, ఆరై  వెంకటి, ఎస్.ఐ.లు, పోలీస్ సిబ్బంది, సరిహద్దు భద్రతా దళం  సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Write comments