యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

 

యాదాద్రి, మార్చి 8 (globelmedianews.com
తెలంగాణ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 18వ తేదీ వరకు 11రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షబంధనం పూజ కార్యక్రమాలు నిర్వహించి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. 


 యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పనులు జరుగుతుండటంతో బాలాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా ముందుగా ప్రధానాలయం లో గర్భాలయంలో స్వయంభూ నరసింహునికి పూజలు నిర్వహించి స్వామి వారి అనుమతితో బాలాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు.

No comments:
Write comments