ఏడీపిఆర్వో దారుణ హత్య

 

కర్నూలు, మార్చి 9, (globelmedianews.com
కర్నూలు జిల్లా  ఆదోని ఎస్కేడీ  కాలనీ లో  దారుణ హత్య జరిగింది. సమాచారాశాఖ కార్యాలయం ఆవరణలో అడిషనల్ డీపీఆర్వో సాయిబాబా దారుణహత్యకు గురైన విషయం శనివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. ఆఫీసు కార్యాలయంలోనే  సాయిబాబాను రాళ్ళతో దారుణంగా కొట్టిచంపారు.


ఏడీపిఆర్వో దారుణ హత్య
 
సాయిబాబా సొంత గ్రామం కర్నూలు జిల్లా నందికొట్కూరు . ప్రతి రోజు విధులు నిర్వహించేందుకు కర్నూలు నుండి ఆదోనికి వచ్చి పోతుంటారు. శుక్రవారం రాత్రి   గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.  ఘటన స్థలానికి  చేరుకున్న బంధువులు చేరుకొని  మృతదేహాన్నీ చూసి బోరున విలపించారు.

No comments:
Write comments