ధర్మపురి దేవాలయ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

 

ధర్మపురి  మార్చి 08  (globelmedianews.com)
కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ  లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ ఆహ్వాన పత్రిక,  వాల్ పోస్టర్స్ ను తెలంగాణ రాష్ట్ర  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. శుక్రవారం ఉదయం  ఆవిష్కరించారు. కరీంనగర్ క్యాంపు ఆఫీసు లో ఈ కార్యక్రమం  జరిగింది. 


ధర్మపురి దేవాలయ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) ప్రారంభాన్ని పురస్కరించుకుని జరిగిన  ఈ కార్యక్రమంలో  ఆలయ కమిటీ సభ్యులు, దేవాలయ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఈవో అమరేందర్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా మంత్రిని వారు స్వామి వారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను, ఫోటోను అందజేశారు. 

No comments:
Write comments