చిన్నారులను చితకబాదిన విద్యార్ధులు

 

కరీంనగర్, మార్చి 6, (globelmedianews.com)
కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ పాఠశాలలో దారుణం జరిగింది. హైదరాబాద్ కు చెందిన విద్యార్థులపై  తొమ్మిదవ తరగతి విద్యార్ధులు బెల్టులు విరిగేలా చితకబాదిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. దెబ్బలకు భయపడి ఇంటికి తిరిగి వచ్చిన ఆరవ తరగతి చిన్నారులు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. 9వ తరగతి గదిలో విద్యార్థుల డబ్బులు పోయాయని ఈ దారుణానికి ఒడిగట్టారు.  


చిన్నారులను చితకబాదిన విద్యార్ధులు

ఈ తతంగం మూడు రోజుల నుండి జరుగుతున్నా పాఠశాల యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  హైదరాబాద్ నగరానికి చెందిన సమీర్,అనే 6వ తరగతి విద్యార్థితో పాటు మరి కొంతమంది చిన్నారులు అదే పాథశాలల్లో చదువుతున్నారు. దెబ్బలు తట్టుకోలేక సమీర్ భయపడి ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు.  దాంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ఫోన్ ద్వారా అడగడంతో  మా దృష్టికి రాలేదని చెప్పారని విద్యార్థుల తల్లిదండ్రులు మండి పడుతున్నారు ఆ దెబ్బలకు చిన్నారుల శరీరాలు మాత్రం కమిలియాయి.

No comments:
Write comments