తెరాస పాలనలో మహిళలకు ప్రాధాన్యత

 

హైదరాబాద్,మార్చి 08 (globelmedianews.com
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మహిళలను పూజించే గొప్ప సంస్కృతి, సంప్రదాయం మన తెలంగాణ కు ఉందన్నారు.  మహిళల కొరకు మహిళల చేత నిర్వహించే మన బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి లో బాగమన్నారు. 


తెరాస పాలనలో మహిళలకు ప్రాధాన్యత

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ ను రాష్ట్ర పండుగగా ప్రకటించి మహిళల కు ఎంతో గౌరవం తీసుకవచ్చారని మంత్రి అభివర్ణించారు. ముఖ్యమంత్రి  కేసీఆర్.. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని వెల్లడించారు. నేడు మహిళలు తమ ప్రతిభతో అన్ని రంగాలలో మరింత ముందుకు రావటం చాలా సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి  తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని  మంత్రి చెప్పారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వారికి ఆసరా పెన్షన్ ఇచ్చే వరకు ప్రతి స్థాయిలో చేయూతనిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతోందన్నారు. మహిళ భద్రతకు పెద్ద పీట వేస్తూ ' షీ టీమ్స్ ' ను ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి అన్నారు 

No comments:
Write comments