రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా

 

లక్నో, మార్చి 7 (globelmedianews.com)
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా...రాజకీయాల్లో ఆసక్తి ఉందని, త్వరలోనే ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ కొన్నిచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు కడుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌‌ నుంచి రంగంలోకి దిగాలంటూ నగరంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు ఏర్పాటు చేశారు.‘‘ రాబర్ట్ వాద్రాజీ... మొరాదాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు మీకు స్వాగతం’’ అంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టర్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.   


రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా

ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శపథం చేశారు. తన మీద ఉన్న ఆరోపణలను తప్పని రుజువు చేసేంత వరకు తాను దేశం విడిచి వెళ్లబోనని ప్రతిజ్ఞ చేశారు. అలాగే, నిజం నిరూపితం అయిన తర్వాతే తాను క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని స్పష్టం చేశారు. ‘నేను ఈ దేశంలో ఉన్నా. చాలా మంది ఈ దేశాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయారు. వారి సంగతి ఏంటి? నేను ఎప్పటికీ ఈ దేశంలోనే ఉంటా. నా మీద కేసు క్లియర్ అయ్యే వరకు నేను దేశం విడిచి వెళ్లను. అలాగే, క్రియాశీలక రాజకీయాల్లోకి కూడా రాను. ఆ మేరకు నేను హామీ ఇస్తున్నా.’ అని స్పష్టం చేశారు.రాబర్ట్ వాద్రా మీద మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. లండన్‌లో పలు విలాసవంతమైన భవనాలు ఆయన పేరు మీద ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆయన్ను ఈడీ పిలిచి విచారణ జరిపింది. ఆయన తల్లిని కూడా విచారించారు. ఈ క్రమంలో ఆయన తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాననే విధంగా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. తాను యూపీలో పుట్టానని, ఇక్కడి వారితో అనుబంధం ఉందని చెప్పారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం జరిగింది

No comments:
Write comments