సమస్యలపై పోరాడే వారినే మండలికి పంపండి

 

ప్రొఫెసర్ కె.నాగేశ్వర్
ఖమ్మం , మార్చి18 (globelmedianews.com)
విద్యారంగ, సామాన్య ప్రజల, ఉపాధ్యాయుల సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసే ఏ.నర్సిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నగరంలోని రామకృష్ణ ఫంక్షన్హాల్లో జరిగినజ్ ‘పెద్దల సభ-ప్రతినిధుల బాధ్యత’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏకపక్ష రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి నష్టమన్నారు. సామాజిక అవగాహన, నిజాయతీ కలిగిన ప్రతినిధుల్ని ఎన్నుకోవటం వల్ల వారు ప్రశ్నించటం ద్వారా ప్రభుత్వ జవాబుదారీతనాన్ని పెంచేందుకు యత్నిస్తారని అన్నారు. 


సమస్యలపై పోరాడే వారినే మండలికి పంపండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రారంభ దశలో ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా పీడీఎఫ్ తరపున మండలిలో కృషి చేశామని, ఆ ఆనవాయితీ నర్సిరెడ్డి కొనసాగిస్తారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. ఎమ్మెల్సీలే సమస్యలు పరిష్కరిస్తారని చెప్పటం హాస్యాస్పదమని, పరిష్కారం కోసం సభలో, బయట ప్రభుత్వంపై ఒత్తిడి తేగలరని అన్నారు. వివిధ పార్టీలు, వర్గాల తరపున ప్రతినిధులుగా ఎన్నికైన వారు అధికార పార్టీకి జైకొడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నర్సిరెడ్డిని  గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నాగేశ్వర్ అన్నారు. ఈ సెమినార్లో టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధానకార్యదర్శి వి.మనోహర్ రాజు, ఎస్టీఎఫ్ రాష్ట్రకార్యదర్శి దేవరకొండ సైదులు, విశ్రాంత అధ్యాపకుడు భాస్కర్రావు, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం నాయకుడు మధుసూదన్రావు, ఒప్పంద అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.సురేశ్, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి, యూటీఎఫ్ రాష్ట్రనాయకులు దుర్గాభవాని, రాజశేఖర్, నర్సింహారావు, జిల్లా నాయకులు వీరబాబు, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments