నయిం లెక్కలు తీసే పనిలో పోలీసులు

 

నల్గొండ, మార్చి 11, (globelmedianews.com )
గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తులలో కొన్ని ఆస్తుల అటాచ్‌మెంట్ కాలేదన్న కోణంలో సిట్ దార్యాప్తు సాగిస్తోంది. భూవనగిరి శివారుల్లోని సర్వేనంబర్ 730లో 5.20 ఎకరాలను భూమిని నయీం అనుచరులు విక్రయించినట్లు వెలుగుచూడటంతో సిట్ అప్రమత్తమైంది. వెంటనే సిట్ రంగంలోకి దిగి అటాచ్‌మెంట్ కానీ నయీంకు చెందిన ఆస్తులను గుర్తించేపనిలో పడింది. బినామీ ప్రాపర్టీస్ ప్రోబిషినరీ యూనిట్ కింద ఆస్తులను అటాచ్ చేసిన విషయం విదితమే. అడ్జుకేటింగ్ అథారిటీతో బినామీ ప్రాపర్టీస్ కింద ఆస్తులను అటాచ్ చేయాలని గతంలోనే ఇన్‌కంట్యాక్స్ పిటిషన్ వేసింది. దీంతో నయీం ఆస్తులపై ఈడి కేసు నమోదు చేసింది. నయీం అక్రమంగా ఆర్జించిన మొత్తాలకు చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా పక్కాగా లెక్కలు ఉన్నప్పటికీ ఆదాయ పన్నుల చెల్లించలేదని ఐటి అధికారుల దర్యాప్తులో తేలింది. అప్పట్లో సిట్ వర్గాల దర్యాప్తులో సైతం ఆదాయ పన్ను కట్టినట్లు ఏలాంటి ఆధారాలు దొరకలేదు.
నయిం లెక్కలు తీసే పనిలో పోలీసులు

నయీం సంపాదించిన ఆస్తులను బినామీల పేరున ఉంచాడని, ఈక్రమంలో తన వరుసకు సోదరుడయ్యే ఫహీం పేరుతో రూ.350 కోట్లు, తన అనుచరురాలు ఫర్హానా పేరుపై రూ.250 కోట్ల మేర ఆస్తులు, అలాగే నయీం ముఖ్య అనుచరుడైన శేషన్న సంబంధీకుల పేరు మీద దాదాపు రూ. 250 కోట్ల ఆస్తులు పెట్టినట్లు ఆప్పట్లో సిట్ గుర్తించింది. కాగా నయీం భార్య పేరుతో కొద్ది పాటి ఆస్తులను ఉంచినట్లు సమాచారం. ఐటి అధికారుల దర్యాప్తులో హైదరాబాద్ నగర శివారులోని తుక్కుగూడలో 12 ఎకరాల ఫాం హౌస్‌ను అరబ్ దేశాల్లో ఉంటున్న తన దూరపు బంధువు పేరిట ఉంచినట్లు తేలింది. వెరసి నయీంకు చెందిన రూ.1200 కోట్ల ఆస్తులను బినామీ ప్రాపర్టీస్ ప్రోబిషినరీ యూనిట్ కింద ఆస్తులను అటాచ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నయీంకు చెందిన అక్రమాస్తులు క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్న రాచకొండ సిపికి సమాచారం అందింది.
నయీం ఆస్తుల విక్రయాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు నయీం ముఖ్య అనుచరులు పాశంశీను, నాసర్ తదితరులు ఆ భూమిని ఇటీవల ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు వెలుగుచూసింది. నయీం భూముల విక్రయాలలో డిసిపి రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు రాచకొండ సిపి మహేష్‌భగవత్‌కు ఫిర్యాదు అందింది. అలాగే భూవనగిరి పట్టణ శివారులోని పలు వెంచర్లలో అటాచ్‌మెంట్ కానీ భూములను గుర్తించి వాటిని విక్రయించేందుకు నయీం మూఠాలోని కీలక వ్యక్తులతో పోలీసులు విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో నయీం అక్రమాస్తులపై చేపట్టిన విచారణలో వెలుగుచూడని ఆస్తులను అమ్ముకునేందుకు నయీం అనుచరులు, బంధువులు యత్నిస్తున్నారన్న సమాచారంలో మరోసారి సిట్ ఆయా ఆస్తులను గుర్తించేందుకు రంగంలోకి దిగింది.

No comments:
Write comments