అందరికీ సమానంగా తాగునీరు అందాలి

 

నేటి అవసరం తాగునీటి పొదుపు చేయడం 
తాగునీటి వాడకంలో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు ఆదేశాలు 
పట్టణంలో నల్లా కనెక్షన్లల పై స్పెషల్ డ్రైవ్ చేపట్టి లెక్క తేల్చాలి
100 రూపాయలకే నల్లా కనెక్షన్లు ఇవ్వండి.
పట్టణంలో 6 తాగునీటి ట్యాంకు నిర్మాణాలు వెంటనే పూర్తి కావాలి
ప్రతి గ్రామ పంచాయతీలో తాగునీటి అంశం పై స్పెషల్ డ్రైవ్ అవగాహన సదస్సు నిర్వహించాలి.
సిద్ధిపేట పట్టణ, నియోజకవర్గంలోని మండలాల తాగునీటి సరఫరాపై ఆర్ డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులతో రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు సమీక్ష
సిద్ధిపేట, మార్చి 09 (globelmedianews.com
సాగునీటి పొదుపు చాలా అవసరమని, అందరికీ సమానంగా తాగునీటిని అందించాలని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఆయన నివాసంలో శనివారం ఉదయం పట్టణ, నియోజకవర్గం పరిధిలోని మండలాల వారీగా నీటి వాడకం పై మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస చారి, డిప్యూటీ డీఈ నాగభూషణం, మున్సిపల్ నీటి విభాగం ఏఈ అన్వేశ్ రెడ్డి, లైన్ మెన్లతో కలిసి సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. పట్టణంలోని అన్నీ వార్డులలో అందరికీ సమానంగా నీటి సరఫరా జరగాలని, యువ ఇంజనీరుగా ఉత్సాహంగా పని చేయాలని అన్వేశ్ ను ఆదేశించారు. 


 అందరికీ సమానంగా తాగునీరు అందాలి

ప్రతి రోజు ప్రతి మనిషికి 120లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉన్నదని, కానీ మన మున్సిపాలిటీ ద్వారా 250 లీటర్ల నీరు అందిస్తున్నట్లు వివరించారు. సిద్ధిపేట మున్సిపాలిటీ ద్వారా నిత్యం 14.5 లక్షల లీటర్ల ఎంఎల్ డీ నీరు అందిస్తుండగా., ఆర్ డబ్ల్యూ ఎస్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ద్వారా అదనంగా 5.4 ఎంఎల్ డీ నీటిని అందిస్తున్నదని., ఈ లెక్కన మొత్తం 21 లక్షల మిలియన్ లీటర్ల నీటిని అందిస్తున్నట్లు వివరిస్తూ.. సిద్ధిపేట పట్టణ జనాభాకు అనుగుణంగా లక్ష 40 వేల మంది ఉన్నారని., ఈ జనాభాకు 14 లక్షల లీటర్ల నీరు అవసరం అయితే.. పలు కొత్త పట్టణ ప్రాంతాలలోని మిషన్ భగీరథను కలుపుతూ అదనంగా 7 లక్షల లీటర్ల నీరు ఎక్కువగా వస్తున్నదని, రోజువారీగా కాకపోయినా దినం తప్పించి దినం.. మరో లెక్కగా చూసినా 5 లక్షల లీటర్ల నీరు ఇస్తున్నామని., ఇలా మొత్తం 21 లక్షల లీటర్ల నీరులో.. దాదాపు 3 లక్షల నీరు అధికారిక, సమన్వయం, సమయపాలన తదితర కారణాలతో..వ్రుథాగా పోయినా., మిగిలిన 3 లక్షల లీటర్లు వ్రుథాగా పోతున్న నీటిని ఆరికట్టాలని రానున్న వేసవికాలం దృష్ట్యా ఇవాళ తాగునీటి పొదుపు చేయడం అత్యవసరమని మున్సిపల్ అధికారిక వర్గాల పనితీరు పై అగ్రహం వ్యక్తం చేశారు. 

No comments:
Write comments