నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

 

అమరావతి, మార్చి 18, (globelmedianews.com)
ఏపీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం విడుదల చేసారు.  
25 లోక్ సభ,175 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. దీంతో ఈ రోజు 11 గంటల నుంచి నామినేషన్ లు ప్రారంభం అయ్యాయి. సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు చేయవచ్చు. 26న పరిశీలన,  27, 28 తేదీల్లో ఉపసంహరణ కు గడువు వుంటుంది. 


నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

ఏప్రిల్ 11న పోలింగ్,   మే 23న ఫలితాలు వెలువడతాయి.21న హోలీ, 24న ఆదివారం కావడంతో ఆ రెండు రోజుల్లోనూ నామినేషన్ల స్వీకరణ ఉండదు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. 1,85, 560 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననుండగా, 94, 991 ఈవీఎంలను ఉపయోగించనున్నారు. 41,356 వీవీపాట్ యంత్రాలను సిద్ధం చేశారు.  ఎన్నికల కోసం ఏకంగా 270 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించనున్నారు. ఇక, ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం 2.95 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

No comments:
Write comments