అద్భుతమైన ప్రగతిని సాధించిన తెలంగాణ రాష్ట్రం : సిఎస్

 

హైదరాబాద్ మార్చ్ 6 (globelmedianews.com)
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. ఎన్డిసి ఫ్యాకల్టి ఇంచార్జి శ్రీ అభయ్ త్రిపాటి నేతృత్వంలో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ 16 మంది సభ్యుల బృందం ఇఎస్ స్టడీలో భాగంగా బుధవారం సచివాలయంలో ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ని కలిసారు. ఈ బృందం  ఈ నెల 4 నుండి 8 వరకు  రాష్ట్రంలో పర్యటిస్తున్నది. గత నాలుగున్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని సి.యస్ వారికి వివరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా దేశంలోనే రోల్ మాడల్ గా నిలిచిందన్నారు. జిల్లాల సంఖ్యను 10 నుండి 33 కు పెంచి పరిపాలనను ప్రజలకు చేరువ చేసామన్నారు. 


అద్భుతమైన ప్రగతిని సాధించిన తెలంగాణ రాష్ట్రం : సిఎస్ 

జిడిపి లోను, ఓన్ టాక్స్ రెవెన్యూలోని మంచి గ్రోత్ రేటును సాధించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తీరును వారికి వివరించారు. టియస్ ఐపాస్, ఇఓడిబి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, 24X7 విద్యుత్ సరఫరా, రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర రంగాలలో చేపట్టిన చర్యలను వారికి వివరించారు. వ్యవసాయ అనుబంధరంగాలైన పాడి, చేపలపెంపకం, గొర్రెల పంపణీల ద్వారా గ్రామీణ అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్నారు. ల్యాండ్ రికార్డ్స్ అప్ డేషన్ ప్రోగ్రామ్ ద్వారా రైతుల భూఖాతాలను సరిదిద్దామన్నారు. మైక్రో ఇరిగేషన్, ఫామ్ మెకనైజేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, విత్తనాల ఉత్పత్తి, ఈనామ్ తదితర రంగాలలో చేపట్టిన చర్యలను వారికి తెలిపారు. వీటితో పాటు ఫార్మా, డిఫెన్స్ రంగాలలో అభివృద్ధిని సి.యస్ వివరించారు. 2018-19 లో ఒక లక్షా ఎనభైరెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టామన్నారు.ఐటి రంగంలో ఎఐ,డిపి, ఐటి,ఎస్ అప్స్ తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.ఎన్డిసి ఫ్యాకల్టి ఇంచార్జి అభయ్ త్రిపాటి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, తమ పర్యటనలో టి-హబ్, ఐఎస్ బి, లను సందర్శిస్తున్నట్లు తెలిపారు. 

No comments:
Write comments