బాబు పోతే జాబు వస్తుంది

 

టంగుటూరు ఎన్నికల ప్రచారంలో   వైఎస్ జగన్ 
ఒంగోలు, మార్చ్,20 (globelmedianews.com)
ప్రకాశం జిల్లా ను అన్ని విధాలా చంద్రబాబు వెనక్కి నెట్టాడు. రామాయపట్నం పోర్ట్ లేదు. నిమ్స్ జడ్  లేదు.పారిశ్రామిక కారిడార్ లేదు. యువతకు ఉద్యోగాలు లేవని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.  బుధవారం టంగుటూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో అయన పాల్గోన్నారు. బాబు వచ్చాడు. .ఫీజు రీయింబర్స్మెంట్ లేదు.  పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను మోసం చేసాడని అయన అన్నారు. ఎన్నికల వేళ పసుపు కుంకుమ అంటూ మరో మోసానికి రెడీ అయ్యాడు. 108 లు మూలన పడ్డాయి. బాబు వచ్చాడు జాబు పోయిందని అన్నారు. 


బాబు పోతే జాబు వస్తుంది

జాబు రావాలి అంటే బాబు పోవాలి. కరువు మండలాలపై అలక్ష్యం చేసారు. నీరు చెట్టు పేరు మీద టీడీపీ దోపిడి చేసింది. వెలిగొండ , సంగమేశ్వర ప్రాజెక్ట్ మూలన పడేసారు బాబు అని అయన విమర్శించారు. మీకు ఎలాంటి నాయకుడు కావాలో మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించుకోండి. మోసగాడు మీకు కావాలా అని ప్రశ్నించారు. ఈ 20 రోజుల్లో చంద్రబాబు చాలా సినిమాలు చూపిస్తాడు జాగ్రత్త అని అన్నారు. మనం  యుద్ధం చేస్తుంది, చంద్రబాబు ఒక్కడిపైనే కాదు. అమ్ముడు పోయినా ఎల్లో మీడియా పైన కూడా అని అయన అన్నారు. ఇంటెలిజెన్స్ శాఖ   టీడీపీ కి వాచ్ మాన్ ల పనిచేస్తుంది. ఈ ఎన్నికలల్లో వాళ్ళే డబ్బు చేర్చబోతున్నారు. మన ప్రభుత్వం వస్తే, అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తాం. చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపోవద్దు. మన ప్రభుత్వం వస్తే రైతులకు రైతు భరోసా పధకం,  గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు వుంటాయి. మార్పు కోసం ఈసారి వైస్సార్సీపి కి ఓటు వేయండి. ధర్మానికి అధర్మానికి మద్య జరుగుతున్న ఎన్నికలు ఇది. కొండెపి   వైస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ వెంకయ్య, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించడని అయన కోరారు. 

No comments:
Write comments