ఆస్ట్రేలియాలో భారతీయ వైద్యురాలు దారుణహత్య

 

సిడ్నీ  మార్చి 6 (globelmedianews.com)
ఆస్ట్రేలియాలో భారతీయ వైద్యురాలు దారుణహత్యకు గురయ్యారు. సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్‌బ్రూక్ డెంటల్ హాస్పిటల్లో ప్రీతిరెడ్డి(32) సర్జన్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం ఓ హోటల్లో బసచేసిన ఆమె కనిపించకుండా పోయారు. దీనిపై కేసు నమోదుకావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె కోసం గాలింపు చేపట్టగా.. మంగళవారం రాత్రి ఓ కారులోని సూట్‌కేసులో శవమై కనిపించారు. ఆమె శరీరంలో అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రీతిరెడ్డి కుంటుంబం చాలా ఏళ్ల కిందటే సిడ్నీలో సెటిలైంది. 


ఆస్ట్రేలియాలో భారతీయ వైద్యురాలు దారుణహత్య

ఆమె తండ్రి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఓ కాన్ఫరెన్స్ నిమిత్తం ఆదివారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రీతిరెడ్డి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆమె సోదరి నిత్యా రెడ్డి సిడ్నీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కోసం గాలించిన పోలీసులు మంగళవారం రాత్రి ఆమె కారులోనే సూట్‌కేసులో శవమై ఉండటాన్ని గుర్తించారు. ప్రీతిరెడ్డి తన మాజీ ప్రియుడు హర్ష్ నర్డేతో కలిసి సిడ్నీ మార్కెట్ స్ట్రీట్‌లోని ఓ హోటల్లో రూమ్ తీసుకున్నట్లు గుర్తించారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆమె సమీపంలోని మెక్ డొనాల్డ్ షాప్‌కు వెళ్లినట్లు సీసీ కెమెరా పుటేజీలో రికార్డయింది. ఆ తర్వాత ఆమె తన బెంజ్ కారులో వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రీతిరెడ్డిని హర్ష్ నర్డే హత్య చేసిన సూట్‌కేసులో కుక్కినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ప్రీతిరెడ్డి కారును కనుగొన్న సమీపంలోనే అతడు కూడా ప్రాణాలు కోల్పోయి ఉండటంతో అసలేమైందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రీతిరెడ్డిని హర్ష్ నర్డే ఎందుకు చంపాల్సి వచ్చిందన్న దానిపై సౌత్‌వేల్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

No comments:
Write comments