టిఆర్ఎస్ తరపున ఆంధ్రలో టిక్కెట్ ఇవ్వండి

 

కెసిఆర్ ను కోరిన కొణిజేటి ఆదినారాయణ
హైదరాబాద్ మార్చ్ 12 (globelmedianews.com)
తెలుగుదేశం పార్టీని ఆంధ్రలో ఓడించాలన్న టిఆర్ఎస్ ఆశయం కోసం పని చేసేందుకు కొణిజేటి ఆదినారాయణ అనే వ్యక్తి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.చాలా పాపులర్ ఇంటి పేరున్నా, కొణిజేటి ఆదినారాయణ రాజకీయల్లో ఎపుడు ఎక్కడా కనిపించలే.ఆయన విజయవాడకు చెందిన వాడు. పబ్లిసిటీకి మంచి మార్గం ఎంచుకున్నాడు.  తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి  అసెంబ్లీకి పోటీ చేసి తెలుగుదేశాన్ని వోడిస్తానని చెబుతున్నారు. టిఆర్ ఎస్ కు ఇష్టమయిన భాషలో చక్కగా విషయం చెబుతున్నారు. ఆంధ్రలో టిడిపి బాగా అన్ పాపులర్ అని, టిఆర్ ఎస్, కెసియార్, ఆయన సంక్షేమ పథకాలు చాలా పాపులర్ 


టిఆర్ఎస్ తరపున ఆంధ్రలో టిక్కెట్ ఇవ్వండి

అని చెబుతున్నారు. అందువల్ల కెసియార్ బొమ్మ పెట్టకుని, పింక్ కండవా వేసుకుని నామినేషన్ వేస్తే చాలా గెల్చిపోతామని చెబుతున్నాడు. ఇప్పటికే మంచి పబ్లిసిటీ వచ్చింది. సోషల్ మీడియా ఆయనను ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లింది.కెసియార్ ఆంధ్రా వచ్చినపుడు స్వాగతం పలకడం వేరు, ఆయన ఫ్లెక్సి బోర్డుకు పూల మాలలు వేయడం వేరు, పాలాభిషేకం చేయడం వేరు. ఎన్నికల్లో అధికారికంగా పోటీ పెట్టించడమంటే చాలా సీరియస్ వ్యవహారం. దీనికి ఎన్నోఅర్థాలు లాగేందుకు , పెడార్థాలు చెప్పేందుకు అవకాశం ఉంటుంది. టిఆర్ ఎస్ తరఫున పోటీ చేస్తే కోణిజేటి వారికి పోయేదేమీలేదు, అంతా రాబడే… కాని టిఆర్ ఎస్ కు చాలా డామేజీ జరగుతుంది ఓగడిపోతే, గెలిస్తే ఫుల్ మజాయే. అయినా సరే, ఇలా పల్లేరుగాయను తగలించుకుంటారా ఎవరయినా?ఆయన ఈ రోజు హైదరాబాద్ కు వచ్చి,అచ్చం టిఆర్ ఎస్ నేతలాగా  అమరవీరుల స్థూపనికి సింపుల్ గా నివాళులర్పించారు.  ఆపైన ఆయన ఆ స్ఫూర్తితో   తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఆంధ్రలో ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీ తరపున పోటీ చెయ్యడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్  అనుమతి కోసం వచ్చానని ఆయన చెబుతున్నారు. తనకు అనుమతి  ఇచ్చి, బీఫామ్ ఇవ్వాలని టిఆర్ ఎస్ పెద్దలను కోరుతున్నాడు. 

No comments:
Write comments