ప్రమోషనా...డిమోషనా

 

ఒంగోలు, మార్చి 13 (globelmediaenews.com)
రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు రాజకీయంగా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. మొదటినుంచి దర్శి నియోజకవర్గం నుండి పోటీచేస్తానని చెప్పుకొచ్చిన శిద్దాకు రాజకీయంగా ప్రమోషన్ దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తొంది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ పార్టీ అధినేత శిద్దాపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. దాంతో దర్శి నియోజకవర్గ పరిధిలోని దర్శి, ముండ్లమూరు, కురిచేడు, తాళ్ళూరు, దొనకొండ మండలాలకు చెందిన ముఖ్యనేతలతో మంత్రి శిద్దా తన నివాసంలో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గం నుంచి పోటీచేయాలా, లేక ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలా అనే అంశంపై నియోజకవర్గం ముఖ్యనేతలతో మంత్రి సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా చాలామంది నాయకులు దర్శి నుంచి పోటీచేయాలని సూచించినట్లు తెలుంది. 


 ప్రమోషనా...డిమోషనా

మంత్రి శిద్దాను ఎంపీగా పోటీకి నిలబెట్టి, ఆయన స్థాస్ధానంలో దర్శి నుంచి కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావును రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కదిరి బాబురావు రాష్టప్రార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఆయన తమ్ముడిని దర్శి నియోజకవర్గం నుంచి పోటీచేయించేందుకు కూడా రాష్టప్రార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దర్శి నియోజకవర్గంలో వైసీపీ తరపున కాపు సామాజికవర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ పోటీలో ఉన్నారు. దాంతో అదే సామాజికవర్గం నుంచి కదిరిని పోటీలోకి దింపితే కాపుల ఓట్లు టీడీపీకి పడే అవకాశాలు ఉంటాయని, టీడీపీ అభ్యర్థి గెలుపు సునాయాసంగా ఉంటుందన్న అభిప్రాయం రాష్టప్రార్టీకి ఉన్నట్లు తెలుస్తోంది. కానీ వీరిద్దరి మద్య నువ్వా, నేనా అన్నట్లు ఎన్నికలు ఉంటాయని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో జనసేన, బీజేపీ, కాంగ్రెస్ తరపున కూడా అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో కాపుల ప్రాబల్యం ఎక్కువుగా ఉన్న పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులను కాదని పవన్‌కల్యాణ్‌కు చెందిన సామాజికవర్గం నేతకు ఓట్లువేస్తే తమ పరిస్థితి ఏమిటనే చర్చ కూడా ప్రధాన రాజకీయపక్షాల నుండి వినిపిస్తోంది. దర్శి నియోజకవర్గంలో మూడువేల కోట్లరూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టగా, తీరా తనకు టికెట్ విషయంలో రాష్టప్రార్టీ స్పష్టత ఇవ్వకపోవటంపై శిద్దా అయోమయంలో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇప్పటికే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీచేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో శిద్దా, మాగుంటల మధ్య ప్రధానమైన పోటీ నెలకొనే అవకాశాలున్నాయి.

No comments:
Write comments