రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

 

చొప్పదండి  మార్చి 8 (globelmedianews.com)
గంగాధర మండలం కురిక్యాల వరద కాలువ బ్రిడ్జి పై ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం ఉదయం జరిగింది. స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గంగాధర మండలంలోని కురిక్యాల గ్రామ శివారులోని వరద కాలువ వద్ద గల రాష్ట్ర రహదారి బ్రిడ్జి పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పెలీసు కానిస్టేబుల్ తిరుపతి మృతి చెందాడు.. 


రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

కానిస్టేబుల్ తిరుపతి గంగాధర పౌలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.  విధుల్లో భాగంగా గంగాధర పోలీస్ స్టేషన్ కు తిరుపతి ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో తిరుపతి దేహం రెండు ముక్కలుగా విడిపోయింది. అయన వాహనం కాలి బూడిదయింది.

No comments:
Write comments