మార్కెట్లో అభినందన్ చీరలు

 

ముంబై, మార్చి 4, (globelmedianews.com])
అభినందన్ వర్ధమాన్.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ భారత వాయుసేన వింగ్ కమాండర్‌కు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎంతలా అంటే.. అభినందన్ మీసం కట్టుకు యూత్‌లో క్రేజ్ పెరిగిపోయేలా. దేశవ్యాప్తంగా యువకులు ఇదే స్టైల్‌లో మీసాల్ని మార్చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా తెగ పెంచేసుకుంటున్నారు. 


మార్కెట్లో అభినందన్ చీరలు

మీసాలు మాత్రమే కాదండోయ్.. ఇప్పుడే ఏకంగా చీరలు కూడా వచ్చేశాయి. గుజరాత్‌లోని సూరత్‌లో వ్యాపారులు అభినందన్ ఫోటో ప్రింట్ చేసి చీరల్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. షాపుల్లోకి స్టాక్ అలా వచ్చిందో లేదో.. చీరలన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. అంతేకాదు వ్యాపారాలకు గిరాకీ బాగా పెరిగిపోయిందట. చీరలు ఇంకా కావాలంటూ ఆర్డర్లు వస్తున్నాయట. మహిళలు ఈ చీరల్ని కొనుగోలు చేసేందుకు క్యూలు కడుతున్నారట. సూరత్ వరకు పరిమితమైన ఈ క్రేజ్.. మిగిలిన రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుందేమో.

No comments:
Write comments