ఉప్పల్ లో లే ఔట్ల వేలానికి నోటిఫికేషన్

 

హైద్రాబాద్, మార్చి 12, (globelmedianews.com)
ఉప్పల్ భగాయత్ ఫేజ్-2 లేఅవుట్లోని ప్లాట్ల ఈ-వేలానికి నోటిఫి కేషన్ మరోసారి విడుదలైంది. గతంలో నోటిఫికేషన్ వేసి ఈ-వేలం ప్రక్రియ ప్రారంభించక సాంకేతిక ఇబ్బందులతో రద్దయిన విషయం తెలిసిందే. ఈ సారి ఈ-వేలాన్ని ప్రైవేటు సంస్థతో కాకుండా కేంద్ర ప్రభుత్వం సంస్థతో ఒప్పందం చేసుకుని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.కేవలం ఉప్పల్ భగాయత్ ఫేజ్-2 లేఅవుట్లోని ప్లాట్లనే విక్రయించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన హెచ్‌ఎండీఏ రిజిస్ట్రేషన్ ప్రక్రియను శనివారం నుం చే ప్రారంభించింది. ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ప్లాట్ల విక్రయానికి అనుహ్యమైన స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు.


ఉప్పల్ లో లే ఔట్ల వేలానికి నోటిఫికేషన్

పూర్తిగా మల్టీ పర్ప స్ జోన్‌లో ఉన్న ఉప్పల్ భగాయత్‌లో71.08 ఎకరాల్లోని లేఅవుట్లో 67 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.భూ సమీకరణ పథకంలో భాగంగా ఉప్పల్ మండలంలోని ఉప్పల్ భగాయత్ గ్రామంలో హెచ్‌ఎండీఏ సేకరించిన 733.08 ఎకరాలలో వాటర్‌బోర్డుకు , మెట్రో రైలుకు భూములు కేటాయించి మిగతా 413.13 ఎకరాలలో 1373 ప్లాట్లతో హెచ్‌ఎండీఏ ఫేజ్-1 లేఔట్‌ను చేసింది. మెట్రో రైలు డిపోకు, మూసీనది వెంట నిర్మిస్తున్న మినీ శిల్పారామం మధ్యలోని 71.08 ఎకరాల్లో ఫేజ్-2 లేఔట్‌ను 67 ప్లాట్లతో సిద్ధంచేసిహెచ్‌ఎండీఏ ఈ-వేలం ద్వారా విక్రయిస్తుంది.రిజిస్ట్రేషన్ ఫీజును జీఎస్టీతో కలిపి రూ.1180గా నిర్ణయించారు. ఈ-వేలం ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఉదయం 9గంటల నుంచి నిర్వహించనున్నారు. గతేడాది ఏప్రిల్లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఈ-వేలంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ప్రస్తుతం ఉప్పల్ భగాయత్ ఈ-వేలంలో పాల్గొంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆగస్టులో తొలిసారిగా ఉప్పల్ భగాయత్‌లో నోటిఫికేషన్ వేసిన సందర్భంలో రూ.5 90తో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ప్రస్తుతం అవకాశం లేదు. 

No comments:
Write comments