ఈవీఎంల ట్యాంపరింగ్‌ పై ఈసి నిజానిజాలు తేల్చాలి

 

భాజపా మాజీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి డిమాండ్‌
న్యూఢిల్లీ మార్చ్ 12  (globelmedianews.com)
ఎన్నికల సంఘం సైతం ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఆరోపణలపై నిజానిజాలు తేల్చాలని భాజపా మాజీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌, సయ్యద్‌ సుజపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కపిల్‌ సిబల్‌, సయ్యద్‌ సుజ చేసిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. 


ఈవీఎంల ట్యాంపరింగ్‌ పై ఈసి నిజానిజాలు తేల్చాలి

తనపైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ దర్యాప్తు చేయాలని సిబల్‌ అన్నారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. సీబీఐ ద్వారా విచారణ చేస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయన్నారు. కేసీఆర్‌ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 16 మంది ఎంపీలతో దిల్లీలో సర్కారు ఏర్పాటు సాధ్యమయ్యే పనేనా? అని ప్రశ్నించారు. తెరాసకు ఓటు వేస్తే కల్వకుంట్ల వారికి గులామ్‌ కావాల్సిందేనని ఎద్దేవాచేశారు. తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్‌కు బీటీమ్‌గా తెరాస మారిందని విమర్శించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారని అన్నారు. ఎన్నికల ముందే కాంగ్రెస్‌పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేస్తానన్నారు. ఎక్కడి నుంచి తన పోటీ అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు.

No comments:
Write comments