ఓటరుగా నమోదు చేసుకోండి: జిల్లా కలెక్టర్

 

కర్నూలు, మార్చి 14 (globelmedianews.com
అర్హత ఉండి ఓటులేని వారందరు వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి ఎస్.సత్య నారాయణ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు, ఓటరు జాబితాలో కొత్త ఓటరుగా మీ పేరు నమోదు చేసుకునేందుకు గడువు ఈ నెల 15వ తేదీతో ముగుస్తుందన్నారు. 


ఓటరుగా నమోదు చేసుకోండి: జిల్లా కలెక్టర్

ఓటర్ల జాబితాలో తమ పేరు లేనివారు ఎన్వీఎస్పీ డాట్ ఇన్ వెబ్  సైట్ నందు గాని లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ నందు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఆఫ్ లైన్ ద్వారా అయితే మీ దరఖాస్తును తహసీల్దారు కార్యాలయం, లేదా బూత్ స్థాయీ అధికారుల వద్ద ఉన్న ఫారం 6 ను నింపి ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. 

No comments:
Write comments