వైసీపీ గూటికి ఎంపీ తోట నరసింహం

 


హైద్రాబాద్మార్చి 11 (globelmedianews.com)
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట నరసింహం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారంఅనారోగ్య కారణాలతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన తోట నరసింహం తన భార్యకు జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు నేపథ్యంలోనే నరసింహం సతీమణి వాణికుమారుడు రామ్జీ,  ఇతర అనుచరులతో ఆదివారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తనకు టిక్కెట్ కేటాయించాల్సిందిగా కోరారుదీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ముందు నరసింహం ఆరోగ్యం కుదుటపడేలా చూసుకోవాలనికోలుకున్న తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారుఈలోగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని సూచించారు


 వైసీపీ గూటికి ఎంపీ తోట నరసింహం

దీంతో ఆమె అసంతృప్తిగానే వెనుదిరిగారుఅయితే కొద్దిరోజులుగా వైసీపీ నేతలు తోట ఫ్యామిలీతో టచ్‌ లో ఉన్నారుగతవారం వైసీపీ నేతబొత్స  సత్యనారాయణనాలుగు రోజుల క్రితం కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి వీరవరం వచ్చి వారితో మాట్లాడి వెళ్లారుజగ్గంపేట సీటు ఇవ్వలేమని,కాకినాడ  సిటీపిఠాపురంపెద్దాపురం  మూడు స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీచేసేందుకు అవకాశం కల్పిస్తామని వైసీపీ నాయకులు తోట వాణికి భరోసా ఇచ్చినట్లుతెలిసింది.  వైసీపీలో చేరితే కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తోట వాణి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారంకాకినాడకువైఎస్జగన్వస్తుండడంతోతోటవాణిఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉందని అనుచర వర్గాల ద్వారా తెలుస్తోందిప్రస్తుతం ఎంపీ తోట నరసింహం విశాఖపట్నంలోని  ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారురెండ్రోజుల్లో వారు వైసీపీలో చేరనున్నట్లు సమాచారం

No comments:
Write comments