పత్తికొండ లోని పోలీస్ స్టేషన్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

 

బార్డర్ చెక్ పోస్టుల పరిశీలన 
తుగ్గలి, మార్చి 18 (globelmedianews.com)
పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ను కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప పరిశీలించారు. సోమవారం నుండి నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో  పోలీస్ స్టేషన్లను మరియు బార్డర్ చెక్ పోస్టులను పరిశీలించారు. నామినేషన్ వేసే ఇండిపెండెంట్ వ్యక్తి వెంట 6 మందికి అనుమతి అని, జాతీయ పార్టీ నామినేషన్ వేసే వ్యక్తి వెంట 7 మందికి అనుమతి అని తెలియజేశారు.జిల్లాలో 700 పోలింగ్ స్టేషన్లు లు సమస్యాత్మకంగా ఉన్నట్లు తెలియజేసారు.


పత్తికొండ లోని పోలీస్ స్టేషన్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ 

ఎలక్షన్ కోడ్ అమలు తర్వాత జిల్లాలో మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల నగదును పట్టుకున్నామని, రెండు కేజీల 187 గ్రాముల బంగారు,27 కేజీల వెండి,2600 లీటర్ల మద్యం మరియు 2970 విస్కీ బాటిల్స్ ను సీజ్ చేశామని తెలియజేశారు.లైసెన్సు కలిగిన పిస్టల్ లు పోలీసు వారి ఆధీనంలో ఉన్నాయని తెలియజేసారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,700 బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వారు తెలియజేశారు.ఎలక్షన్ల బందోబస్తు కొరకు జిల్లాకు కేంద్ర బలగాలు వచ్చాయని తెలియజేసారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.ఎన్నికలలో ప్రజలు అల్లర్లు సృష్టించకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  సీఐ రామయ్య, సిఐ భాస్కర్ రెడ్డి, తుగ్గలి ఎస్ఐ శ్రీనివాసులు, జొన్నగిరి ఎస్ ఐ ఆనంద్ ప్రసాద్ ఇరత సిబ్బంది లు పాల్గొన్నారు.

No comments:
Write comments