తిత్లీ బిల్లులెక్కడ..? (శ్రీకాకుళం)

 

శ్రీకాకుళం, మార్చి 6 (globelmedianews.com): 
తిత్లీ తుపాను బాధిత కుటుంబాలకు భోజనాలు పెట్టిన మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటివరకు బిల్లులు అందలేదు. తుపాను సందర్భంగా తక్షణ సాయం అందించేందుకు నిరంతరం శ్రమించిన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు అప్పు చేసి మరీ బాధితులకు భోజనాలు పెట్టారు. నాలుగైదు రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని ప్రత్యేక అధికారులు ఇచ్చిన హామీ నాలుగు నెలలైనా నెరవేరకపోవడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బిల్లుల విషయమై ఉపాధ్యాయులకు మొరపెట్టుకుంటే మండల విద్యాశాఖాధికారులను కలవాలని, అక్కడికి వెళ్తే తహసీల్దార్‌ను అడగాలని.. ఇలా ఒకరి దగ్గరకువెళ్తే ఇంకో చోటికి పంపించడం తప్ప సమస్య పరిష్కారం కాకపోవడంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తిత్లీ బిల్లులెక్కడ..? (శ్రీకాకుళం)

తిత్లీ తుపాను సందర్భంగా జిల్లాలో 19 మండలాల పరిధిలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో తాగునీటికీ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో వంటలు చేయించి తుపాను బాధితులకు భోజనాలు సమకూర్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు భోజనాల ఏర్పాటు విషయంలో పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు తుపాను ప్రత్యేక అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అన్నిచోట్ల వంటలు చేసేలా ఒత్తిళ్లు తెచ్చి భోజనాలు సమకూర్చారు. పాఠశాలలకు సంబంధించి కొన్నిచోట్ల ఉపాధ్యాయులు అప్పులు ఇప్పించగా, మరికొన్ని చోట్ల నిర్వాహకులే అప్పు తెచ్చి భోజనాలు వండారు. 14 రోజుల పాటు రెండు పూటలా సేవలందించారు. 19 మండలాల పరిధిలోని 1589 పాఠశాలల్లో 12.78 లక్షల భోజనాలు తుపాను బాధిత కుటుంబాలకు ఏర్పాటుచేశారు. ఇందుకు రూ. 1.09 కోట్ల నిధులు వంట నిర్వాహకులకు చెల్లించాల్సి ఉంది. 

No comments:
Write comments